ఒకవైపు సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మరోవైపు దర్శకుడు వంశీపైడిపల్లిలు, దిల్‌రాజు-అశ్వనీదత్-పివిపి వంటి ముగ్గురు భారీ నిర్మాతలు నిర్మించే చిత్రం కావడం, అందునా ఇది మహేష్‌కి మైలురాయి వంటి ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం వంటి పలుకారణాల వల్ల ‘మహర్షి’ చిత్రం బాగా ఆలస్యం అవుతోంది. ఇప్పటికే మూడు రిలీజ్ డేట్లను ఈ చిత్రం మార్చుకుంది. ఏప్రిల్5 నుంచి ఏప్రిల్ 25కి అక్కడి నుంచి మే9కి పోస్ట్‌పోన్ అయింది. ఇక ఇందులో మహేష్‌బాబుతో పాటు హీరోయిన్‌గా పూజాహెగ్డే, మహేష్ స్నేహితునిగా అల్లరినరేష్‌లు నటిస్తున్నారు.
తాజాగా ఈచిత్రం మెయిన్‌లైన్ ఇదేనని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. కథ ప్రకారం ఈ చిత్రం సెకండాఫ్‌కి ముందే అల్లరినరేష్ మరణిస్తాడట. దాని తర్వాతనే తన స్నేహితుని మరణానికి కారణం తెలుసుకుని హీరో మహేష్‌బాబు విదేశాల నుంచి ఆ గ్రామానికి వచ్చి తన స్నేహితుడి లక్ష్యాన్ని నెరవేరుస్తాడట. అక్కడి నుంచి విలన్లు, ఎత్తులు పైఎత్తులు, చివరకు సమాజసేవ వంటి వాటితో పాటు ఓ మంచి మెసేజ్ కూడా ఉంటుందని సమాచారం. అల్లరి నరేష్ నిజంగా ఎందుకు చనిపోతాడు? అతని లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యం కోసం అతను మరణించాడు అనే విషయాలను తెలుసుకున్న తర్వాతనే హీరోకి తాను చేయాల్సిన కర్తవ్యం బోధపడుతుంది. అందుకే కోట్లాది రూపాయల సంపదను వదులుకుని తన స్నేహితుని గ్రామానికి వస్తాడనేది మెయిన్ పాయింట్‌గా తెలుస్తోంది.
ఇక ‘మహర్షి’కి ముందు మహేష్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’, పూజాహెగ్డే నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లు పెద్ద హిట్ అయ్యాయి. దాంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీటన్నింటి కారణంగా ‘మహర్షి’ డిజిటల్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది. అమేజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ని ఏకంగా 11కోట్లకు సొంతం చేసుకున్నారని సమాచారం. ఇక థియేటికల్ రైట్స్, రీమేక్, డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా భారీ ఎత్తున ఆఫర్లు వస్తూ ఉండటం విశేషం.