మహేష్ బాబు గత సినిమాలు అట్టర్ ప్లాప్ అయినా.. అతని నుండి సినిమా వస్తుంది అంటే క్రేజ్ ని వర్ణించడం చాలా కష్టం. బ్రహ్మోత్సవం ప్లాప్ అయినా.... స్పైడర్ మీద ఎలా అయితే అంచనాలున్నాయి.... స్పైడర్ ప్లాపయినా.. భరత్ అనే నేను మీద అంతే అంచనాలున్నాయి. మరి భరత్ అనే నేను హిట్ అయ్యింది. మరి ఇప్పుడొస్తున్న మహర్షి మీద ఎంత ఆంచనాలుండాలి. ఉన్నాయి... ఆ అంచనాలు ఆకాశాన్ని తాకే అంచనాలు. అందుకే మహర్షి థియేట్రికల్ బిజినెస్ 100 కోట్లు దాటిందనే టాక్ మొదలైందో లేదో... తాజాగా డిజిటల్ రైట్స్ విషయంలో మహేష్ నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పాడు.
మహర్షి సినిమాని వంశి పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. మరి కెరీర్ లో వంశి పైడిపల్లికి ఓ అన్నంత బ్లాక్ బస్టర్ హిట్ లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసాడు కానీ.. క్రేజ్ అంతంత మాత్రమే. కానీ సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ వేరు. అందుకే మహర్షి బిజినెస్ వీరలెవల్లో జరుగుతుంది. ఇంకా శాటిలైట్ హక్కులను డీల్ ని క్లోజ్ చెయ్యని మహర్షి నిర్మాతలు.. మహర్షి డిజిటల్ డీల్ క్లోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మే తొమ్మిదిన విడుదలకాబోతున్న మహర్షి డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు 11 కోట్లకి దక్కించుకున్నారని.. ఈ డీల్ తో మహర్షి నాన్ బాహుబలి రికార్డ్స్ ని కొల్లగొట్టింది అంటున్నారు. మహేష్ భరత్ అనే నేను కూడా అమెజాన్ తీసుకోవడం. అమెజాన్ ప్రైమ్ లో భరత్ అనే నేనుకి మంచి స్పందన రావడంతో. ఇప్పుడు మహర్షి సినిమాకి అదిరిపోయే డీల్ చేసినట్లుగా చెబుతున్నారు.