మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాని వంశి పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. వంశి పైడిపల్లి కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా.. మహర్షి కథ నచ్చి మహేష్ బాబు ఈ సినిమాని చేస్తున్నాడు. మహర్షి సినిమా మే 9 న విడుదలకాబోతుండగా.. ఇంకా ఇప్పటివరకు షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. ఇంకా రెండు పాటలు, ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉందట. ఇకపోతే మహేష్ బాబు మహర్షి సినిమాలో అల్లరి నరేష్ ఓ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లరి నరేష్ మహర్షిలో ఆ కీలకపాత్ర చెయ్యడానికి ఏకంగా కోటిన్నర అందుకుంటున్నాడనే టాక్ ఉంది.
తాజాగా మహర్షి సినిమా కథ లీక్ అంటూ కొన్ని న్యూస్ లు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే మొదటినుండి మహర్షి కథగా ప్రచారమవుతున్నదే. అల్లరి నరేష్ - మహేష్ - పూజలు మంచి ఫ్రెండ్స్. ఇక చదువులైపోయాక మహేష్ అమెరికాకి, అల్లరి నరేష్ ఊరికి వెళ్లిపోగా... నరేష్ కొన్ని కారణాల వలన చనిపోగా.. అమెరికా నుండి వచ్చిన మహేష్ స్నేహితుడి ఆశయాల కోసం, ఉన్న కోట్లాది ఆస్తిని వదులుకుని స్నేహితుడు ఊరికి రావడమే కాదు.... అక్కడ గ్రామస్తులకు చేదువాదోడుగా ఉంటూ స్నేహితుడు కలలు కన్న గ్రామంగా ఆ ఊరిని తీర్చి దిద్దుతాడట.
ఇక అల్లరి నరేష్ పాత్రని దర్శకుడు ఫస్ట్ హాఫ్ లోనే చంపేస్తాడని.. సెకండ్ హాఫ్ మొత్తం అల్లరి ఆశయాల కోసమే మహేష్ పనిచేస్తాడని అంటున్నారు. మరి మహర్షి కథ ఇదే అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంతుందో అనేది మే తొమ్మిదన కానీ రివీల్ అవదు.