Advertisementt

‘కీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Tue 02nd Apr 2019 07:24 PM
hero jeeva,key movie,release date,april 12  ‘కీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది
KEY Movie Release Date Fixed ‘కీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది
Advertisement
Ads by CJ

‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో జీవా క‌థానాయ‌కుడిగా సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘కీ’. నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కలీస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.  కృష్ణ క్రియేష‌న్స్‌, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బేన‌ర్స్ నిర్మాణంలో సినిమా తెలుగులో విడుద‌ల‌వుతుంది. ఏప్రిల్ 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘కీ’ చిత్రం విడులకు సిద్ధ‌మైంది. 

టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో.. ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అంతే ఉంటుంది. కంప్యూట‌ర్‌ను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు. ఆ న‌ష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంత‌గా. అలాగే  రీసెంట్ టైమ్స్‌లో బ్లూవేల్ గేమ్ వార్త‌ను మ‌నం త‌రుచూ చ‌దువుతూనే ఉన్నాం. ఈ బ్లూవేల్ గేమ్ ఆడి ఎంతో మంది యువ‌త బ‌ల‌వంతంగా త‌మ ప్రాణాల‌ను తామే తీసుకుంటున్నారు. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన బ్లూవేల్ గేమ్ కూడా ఈ సాంకేతిక‌త‌లో భాగంగానే ఉంది. కానీ ఇటువంటి బ్లూవేల్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట‌ను మ‌నం అంద‌రం ఆడుతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే. ఏప్రిల్ 12 వ‌ర‌కు ఆగాల్సిందే. ఎందుకంటే అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‘కీ’ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇటీవ‌ల సుకుమార్ చేతుల మీదుగా విడులైన ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ద‌ర్శ‌కుడు క‌లీస్ సినిమాను సాంకేతికత‌లోని మ‌రో కోణాన్ని ట‌చ్ చేస్తూ ‘కీ’ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు.

KEY Movie Release Date Fixed:

KEY Movie Release on April 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ