బాహుబలి పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఈ మద్య ప్రతి ఎన్నికల్లోనూ ఆ చిత్రంలోని పాత్రధారులతో రాజకీయ నాయకులు తమను పోల్చుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఆమద్య మోదీ కూడా ఉత్తరభారతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తనని తాను బాహుబలి, కట్టప్పలతో పోల్చుకున్నాడు. తాజాగా ఈ ఎన్నికల్లో చంద్రబాబుకూడా తన నోటి నుంచి బాహుబలి మాట ఎత్తాడు. ఈ ఎన్నికల్లో జగన్, కేసీఆర్, మోదీ ముగ్గురు కలిసి ఏపీపై దాడికి వస్తున్నారు. వారందరికి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ఏపీ ప్రజలపై ఉంది. మాకు ఓటు వేయని వారికి రాష్ట్రంపై ప్రేమలేనట్లు భావించాల్సి ఉంటుంది.
తెలంగాణ అంతా ఏకమైనప్పుడు మనకేం తక్కువైంది? తెలంగాణలో అన్ని పార్టీలను చంపేసిన కేసీఆర్ తనకి 16 సీట్లు వస్తాయని అంటున్నారు. నువ్వు 16 సీట్లు గెలిస్తే మేం 25 సీట్లు గెలిచి చూపిస్తాం. నువ్వు బాహుబలివి అయితే నేను మహాబాహుబలిని అవుతా! నువ్వు మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం. ప్రపంచంలో ఆంధ్రులు ఎక్కడ ఉన్నా నేను రక్షణనిస్తాను. జన్మభూమికి ద్రోహం చేస్తే మాత్రం వారిని వదులుకునేందుకు నేను సిద్దం. నేను పిరికి పందను కాను. మా జోలికి వస్తే అడ్రస్ గల్లంతు చేస్తాం. రాజాంలో చేసే నినాదాలు హైదరాబాద్‌లోని కేసీఆర్‌కి, ఢిల్లీలోని మోదీకి వినిపించాలి.. అంటూ ఉద్వేగ పూరిత ప్రసంగం చేశాడు.