Advertisementt

మరో బయోపిక్‌లో విద్యాబాలన్

Mon 01st Apr 2019 01:01 PM
vidya balan,biopic,ntr biopic,mayavati,bollywood actress  మరో బయోపిక్‌లో విద్యాబాలన్
Vidya Balan in Another Biopic మరో బయోపిక్‌లో విద్యాబాలన్
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఇండియాలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్‌లో మహానటి సినిమా తరువాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో  బసవ రామతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్‌కి ఆ చిత్రంతో విజయం దక్కలేదు. ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్‌ వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు.

హిందీ‌లో కూడా ఈ చిత్రంని అనువాదం చేద్దాం అనుకున్నారు కానీ తెలుగులోనే డిజాస్టర్ అవ్వడంతో ఆ ఆలోచన మానుకున్నారు. పెళ్ళైన తరువాత సినిమా కెరీర్‌కి దాదాపు స్వస్తి పలికిన విద్యాబాలన్‌ ఈ చిత్రంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆమె ఏజ్ వెయిట్‌కి తగ్గట్టు పాత్రలు వస్తున్నాయి.

ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తుంది కాబట్టి ఆమెను అటువంటి పాత్రలే వరిస్తున్నాయి. జయలలితకి సంబంధించిన ఒక బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ చేస్తోన్న విద్యాబాలన్‌ త్వరలో మాయావతి బయోపిక్‌లో కూడా మాయావతి పాత్ర పోషించనుంది. త్వరలోనే వీటి వివరాలు తెలియనున్నాయి.

Vidya Balan in Another Biopic:

Vidya Balan in Mayavati biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ