Advertisementt

నాని సినిమాకు టైటిల్ ఫిక్సయింది..!

Mon 01st Apr 2019 12:30 PM
vyooham,nani,sudheer babu,indraganti mohankrishna,title,jersey  నాని సినిమాకు టైటిల్ ఫిక్సయింది..!
Nani and Indraganti Movie Title Fixed నాని సినిమాకు టైటిల్ ఫిక్సయింది..!
Advertisement
Ads by CJ

కెరీర్‌లో హిట్స్ కి పొంగిపోయి.. ప్లాప్స్ కి కుంగిపోకుండా వరస సినిమాల్తో ఠారెత్తిస్తున్న నేచురల్ స్టార్ నాని జోరు మాములుగా లేదు. సినిమాల మీద సినిమాలు చేస్తూ... వరసగా సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. గత ఏడాది కృష్ణార్జున యుద్ధం ప్లాప్ తర్వాత నాని ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యం ఉన్న జెర్సీ సినిమా చేసాడు. జెర్సీ ఏప్రిల్ 19న విడుదల కాబోతుంది. ప్రస్తుతం జెర్సీ షూటింగ్ తోనూ, ప్రమోషన్స్ తోనూ బిజీగా వున్న నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో మరో మూవీ ఒప్పేసుకున్న విషయం తెలిసిందే.

అష్టాచెమ్మా, జెంటిల్మన్ లాంటి హిట్స్ ఇచ్చిన ఇంద్రగంటితో మూడో సినిమాకి నాని సైన్ చేసాడు. అయితే ఇంద్రగంటి సినిమా జంటిల్మన్‌లో నాని ఒక నెగెటివ్ కేరెక్టర్ కూడా చేసాడు. తాజాగా ఇంద్రగంటితో నాని చెయ్యబోయే సినిమాలో కూడా నాని విలన్ రోల్ ప్లే చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడు. అతనే సుధీర్ బాబు. 

సుధీర్ బాబు హీరోగా... నాని విలన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఇంద్రగంటి టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. నాని - సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబోలో రాబోయే సినిమా పేరు ‘వ్యూహం’ అనే టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి నాని ఎలాంటి ‘వ్యూహం’తో సుధీర్ బాబుతో ఆడుకుంటాడో చూద్దాం.

Nani and Indraganti Movie Title Fixed:

Vyooham Title Fixed for Nani, Sudheer Babu and Indraganti Combo Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ