Advertisementt

అల్లు గేటు దూకి నందమూరి కాంపౌండ్‌‌లోకి!

Mon 01st Apr 2019 11:21 AM
mallidi venu,film,nandamuri kalyan ram  అల్లు గేటు దూకి నందమూరి కాంపౌండ్‌‌లోకి!
Movie Changes From Allu Family to Nandamuri Compound అల్లు గేటు దూకి నందమూరి కాంపౌండ్‌‌లోకి!
Advertisement
Ads by CJ

తెలుగులో నిర్మాతగా మల్లిడి సత్యనారాయణరెడ్డికు మంచి పేరే ఉంది. ఆయన వినాయక్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా వచ్చిన ‘బన్నీ’ చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఈయన కుమారుడు మల్లిడి వేణు ఎప్పటి నుంచో దర్శకునిగా పరిచయం అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఓ సోషియో ఫాంటసీ స్టోరీని తయారు చేసి అల్లు శిరీష్‌కి వినిపించాడు. కానీ సోషియో ఫాంటసీ కావడంతో బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది? అనే పాయింట్‌తో పాటు పలు కారణాల వల్ల ఈ చిత్రం పట్టాలెక్కలేదు. 

తాజాగా వేణు మల్లిడి ఇదే స్టోరీని నందమూరి కళ్యాణ్‌రామ్‌కి చెప్పి ఓకే చేయించుకున్నాడట. గత ఏడాది ‘ఎమ్మెల్యే, నా నువ్వు’ చిత్రాలతో దెబ్బతిన్న కళ్యాణ్‌రామ్‌ తాజాగా వచ్చిన గుహన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘118’ ద్వారా విభిన్న చిత్రం చేసి సక్సెస్‌ కొట్టాడు. దాంతో కళ్యాణ్‌రామ్‌ తన తదుపరి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా ఈయన వేణు మల్లిడితో ఈ సోషియో ఫాంటసీ కథను చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. 

బడ్జెట్‌ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండటం వల్ల బయటి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని కళ్యాణ్‌రామ్‌ తన ‘ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌’ బేనర్‌లోనే తానే నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిచనున్నాడట. దీని కోసం ‘తుగ్లక్‌’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతోనైనా కళ్యాణ్‌రామ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ కొడతాడేమో వేచిచూడాల్సివుంది...! 

Movie Changes From Allu Family to Nandamuri Compound:

Mallidi Venu Film with Nandamuri Kalyan Ram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ