చంద్రబాబుపై తెలంగాణకి చెందిన మోత్కుపల్లి నరసింహులు తీవ్ర పదజాలంతో విమర్శించారు. తెలంగాణ టీడీపీలో ఒకనాడు కీలకనేతగా ఉన్న మోత్కుపల్లి మాట్లాడుతూ, దళితుడిని అయిన నేను ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పనిచేశాను. కానీ చంద్రబాబు వంటి దుర్మార్గుడు ఆయన అల్లుడిగా వచ్చి వెన్నుపోటు పొడిచాడు. గ్రహాలు తొమ్మిదే అయినా పదో గ్రహంగా చంద్రబాబుని చెప్పుకోవాలి. ఆయన నక్కజిత్తుల వాడు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తంతే పారిపోయిన పిరికి పంద చంద్రబాబు. నీవు నీతిమంతుడువే అయితే 29 కేసుల్లో స్టే ఎందుకు తెచ్చుకున్నావు? తెలంగాణలోటిడిపి కనుమరుగైంది.
ఇక ఏపీలో కూడా చంద్రబాబుని ఓడించి శని వదిలించుకోవాలి. చంద్రబాబు వల్ల ఏపీకి ప్రత్యేకహోదా రాదు. కేసీఆర్ లెటర్ ఇస్తేనే ప్రత్యేక హోదా ఏపీకి వస్తుంది. 70ఏళ్ల వయసున్న చంద్రబాబు తాను అందరికి పెద్ద కొడుకుని అని చెప్పుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే చంద్రబాబు పెద్ద కొడుకు కాదు.. ఆయన పెద్ద తాత. చంద్రబాబు సభలో ఆయన ప్రసంగాలు వింటున్న వారి చెవులు నుంచి రక్తం కారుతోంది అని విమర్శనాస్త్రాలు సంధించాడు. మరి మోత్కుపల్లి విమర్శలకు చంద్రబాబు ఏమి సమాధానం చెబుతాడో వేచిచూడాలి...!