Advertisementt

ఛల్ మోహన్ రంగాకి మరో ఛాన్స్..!

Sun 31st Mar 2019 02:29 PM
nithiin,krishna chaitanya,combo,movie  ఛల్ మోహన్ రంగాకి మరో ఛాన్స్..!
Again Movie in Chal Mohan Ranga Combo ఛల్ మోహన్ రంగాకి మరో ఛాన్స్..!
Advertisement
Ads by CJ

లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం వంటి డిజాస్టర్స్ తో ఉన్ననితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత వెంకీ కుడుములతో భీష్మ చిత్రాన్ని చేస్తున్నాడు. నితిన్ బర్త్ డే సందర్భంగా భీష్మ ప్రీ లుక్, అండ్ ఫస్ట్ లుక్ లను వదిలింది చిత్ర బృందం. ఫస్ట్ లుక్ ఎంతో హడావిడి చేసినా ఇంకా భీష్మ సినిమా ఆఫీషియల్ గా సెట్స్ మీదకెళ్ళలేదు. ఇక ఆ సినిమాతో పాటుగా హోలీ రోజున నితిన్ చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమాని అనౌన్స్ చేసాడు నితిన్. అసలే ప్లాప్స్ లో ఉన్న నితిన్ మరొక ప్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. అందులోను ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథని నితిన్ ఒప్పుకుని చంద్రశేఖర్ ఏలేటితో సినిమా చేస్తున్నాడు.

తాజాగా మరో ప్లాప్ డైరెక్టర్ తో నితిన్ సినిమాని తన పుట్టిన రోజున ప్రకటించడంతో నితిన్ ఫ్యాన్స్ బాగా వర్రీ అవుతున్నారు. శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో ఇంతకుముందు తనతో ఛల్ మోహన్ రంగ చేసి డిజాస్టర్ ఇచ్చిన కృష్ణచైతన్యకి నితిన్ మరొక ఛాన్స్ ఇచ్చాడట. తన పుట్టిన రోజున నితిన్ స్వయంగా కృష్ణ చైతన్యతో తన సినిమాని ప్రకటించాడు. మరి తనకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడం అనేది నితిన్ ని మెచ్చుకోవాల్సిన విషయమే. రౌడీ ఫెలో తో డైరెక్టర్ గా పరిచయమయిన కృష్ణ చైతన్య నారా రోహిత్ తో రౌడీ ఫెలో చేసి ప్లాప్ కొట్టాడు. నితిన్ తో ఛల్ మోహన్ రంగ ప్లాప్. మరి నితిన్ ఏ ఉద్దేశ్యంతో ఇలా ప్లాప్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తున్నాడో ఆయనికే తెలియాలి.

Again Movie in Chal Mohan Ranga Combo:

Nithiin and Krishna Chaitanya Combo soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ