మెగా ఫ్యామిలీ నుండి ఏకైక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెలకు లక్కు అస్సలు కలిసి రావడం లేదు. ఏదో వెబ్ సీరీస్ తో కాలం గడిపెయ్యకుండా హీరోయిన్ అంటూ సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ మెగా ప్రిన్స్. ఒక మనసు సినిమాలో నాగశౌర్యతో కలిసి నటించింది. ఆ ఇసినిమా యావరేజే అయ్యింది. తర్వాత హ్యాపీ వెడింగ్ అంటూ సుమంత్ అశ్విన్ తో కలిసి హడావిడి చేసింది. కానీ ఆ సినిమా కూడా పోయింది. మెగా అభిమానులే నిహారిక సినిమాలను హిట్ చేయలేకపోతున్నారు. మరి ౩౦ ఏళ్లు వచ్చాయి అంటే పెళ్లి చేస్తామని ఇంట్లో వాళ్ళు చెప్పారు.. ఈలోపే సినిమాలు చేసుకోవాలని చెప్పిన నిహారిక.. ఎడా పెడా సినిమాలేవీ చెయ్యడం లేదుకానీ.. ఆమెతో సినిమాలు చేసే దర్శకులే సరిగ్గా నిహారికకు హిట్ ఇవ్వలేకపోతున్నారు. నిహారికతో సినిమా అంటేనే సినిమా కథ మొత్తం నిహారికనే హైలెట్ చేస్తూ.. ఆమె చుట్టూనే తిరిగేటట్టుగా రాసుకుంటున్నారు. అక్కడే వాళ్లకి దెబ్బేసేది.
తాజాగా రాహుల్ విజయ్ హీరోగా నిహారిక ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రణీత్ సూర్యకాంతం అనే సినిమాని తెరకెక్కించాడు. మరా సినిమాలో సూర్యకాంతంగా నిహారిక క్యారెక్టర్ బావుంది కానీ.. ఆమె నటనకు ప్రేక్షకులే కనెక్ట్ కాలేకపోతున్నారు. నిహారిక నటించిన సూర్యకాంతం సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. డిజాస్టర్ టాక్ వచ్చింది. రివ్యూ రైటర్స్ కూడా సూర్యకాంతంకి ఫెయిల్ మార్కులే వేశారు. నిన్న శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా దిగిన సూర్యకాంతం పూర్ టాక్ తో మొదలై సాయంత్రానికి థియేటర్స్ దగ్గర జనాలు లేక వెలవెలబోయాయి అంటే మెగా ప్రిన్స్ పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది.
మరి మార్చి పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే మార్చి అన్నట్టుగా నిహారిక పరీక్షలు రాస్తూనే ఉంది.. ఫెయిల్ అవుతూనే ఉంది. నిన్న విడుదలైన సూర్యకాంతం నిహారికకు ఎలాంటి ప్లస్ కాదు కదా... ఆ సినిమా చూసిన వారంతా మెగా డాటర్ కి సినిమాలెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి నిహారిక ఇక సినిమాలు ఆపేస్తుందో.. లేదంటే మరో ట్రయిల్ వేసుకుంటుందో చూద్దాం.