Advertisementt

‘సైరా’లో రెండే రెండు నిమిషాలు: నీహారిక

Sun 31st Mar 2019 01:00 PM
chiranjeevi,sye raa movie,niharika role,2 minutes  ‘సైరా’లో రెండే రెండు నిమిషాలు: నీహారిక
Niharika About Her Role in Sye Raa ‘సైరా’లో రెండే రెండు నిమిషాలు: నీహారిక
Advertisement
Ads by CJ

సైరా సినిమాలో నిహారిక నటిస్తుందని క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ గా నిహారిక ఆన్ లొకేషన్ పిక్ కూడా బయటికి వచ్చింది. అయితే నిహారిక ఇందులో స్క్రీన్ టైం చాలా చాలా తక్కువట. కేవలం రెండే రెండు నిముషాలు అంట. అయినా కానీ తనకు మెగాస్టార్ సినిమాలో నటించాలని కలలు కన్నానని.. కాబట్టి అందులో ఒక్క నిమిషం కనిపించినా తనకు బాధేమీ లేదని చెప్పింది.

ఇందులో ఒక సన్నివేశం లో నేను చేసిన యాక్టింగ్ కి ప్రశంసలు దక్కుతాయని ఆశిస్తున్నానని నిహారిక చెప్పింది. ఇక నిహారిక లేటెస్ట్ మూవీ ‘సూర్యకాంతం’ మూవీ కొన్ని గంటలు ముందే రిలీజ్ అయింది. ఇందులో ఆమె నటన ప్రేక్షకులకి నచ్చిందట.

‘‘ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌" రెండు మంచి సినిమాలే కానీ ఫలితాలే నిరాశ పరిచాయి. అందుకే ఈసినిమాపై ఫోకస్ పెట్టింది. భవిష్యత్తులో సినిమాల్లో కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నకు... తనకు ప్రొడక్షన్ మీద, వెబ్ సిరీస్ మీద ఆసక్తి ఉందని చెప్పడం ద్వారా మున్ముందు కథానాయికగా కొనసాగడం సందేహమే అని చెప్పకనే చెప్పింది ఈ కొణిదెల అమ్మాయి.

Niharika About Her Role in Sye Raa:

Niharika Role in Sye Raa Only 2 Minutes