వినోద్, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లుగా, సెల్ఫీ వల్ల జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా సి.హెచ్. ప్రభాకర్ (చరణ్) స్వీయ దర్శకత్వంలో చిరుగురి చెంచయ్య సుగుణమ్మ సమర్పణలో శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్ బ్యానర్ సంస్థ వారు నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’.. పోతుమర్తి సతీష్ గాయ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేయగా ఈ ట్రైలర్ కి మంచి స్పందన దక్కింది.. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది.. శ్రీనివాస్ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదల కాగా ఆ ఆడియో సూపర్ హిట్ అయ్యింది.. కాగా ఈ చిత్రం యొక్క పోస్టర్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.. అంతేకాకుండా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులను కూడా అందజేయనున్నారు. ప్రేక్షకులు ఆసక్తికరమైన సెల్ఫీని ఫేస్ బుక్ లో ‘ఇది నా సెల్ఫీ’ పేజీకి టాగ్ చేసి పోస్ట్ చేయాలి.. దాంట్లో ఉత్తమమైన సెల్ఫీని ఎంపిక చేసి విజేతలుగా నిర్ణయిస్తారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత , దర్శకుడు సి.హెచ్ ప్రభాకర్ (చరణ్) మాట్లాడుతూ... సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది. రెండు గంటలు ప్రేక్షకులని మెప్పిస్తుంది. సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. సెల్ఫీల మోజులకే పరిమితమయిపోతున్న ఈ జనరేషన్ ని మార్చే సినిమా ఇది. మంచి ఎంటర్ టైన్మెంట్ తో కూడిన కథ. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి థాంక్స్. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారండి. కానీ పెద్ద మనసున్న మనుషులు కొంతమందే ఉన్నారు. అందులో రాజ్ కందుకూరి గారు ఒకరు. మా చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన టెక్నిషియన్స్, నటీనటులకు నా కృతజ్ఞతలు. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసిన పోతుమర్తి సతీష్ గాయ్ గారికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమాని చూసి ప్రేక్షకులు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు.
సహా నిర్మాత సతీష్ గాయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించిన అందరికి ధన్యవాదాలు. ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలనేది నా కల. అలాటి టైంలో నాకు ప్రభాకర్ గారు పరిచయడం అవడం.. ఈ సినిమా కథ నచ్చి వారితో కలిసి తీయడం జరిగింది. అందరికి నచ్చే సినిమా. మంచి సోషల్ మెసేజ్ ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తప్పక ఈ సినిమా చూడండి అన్నారు.
నటుడు బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. సినిమా తీయాలనే ప్యాషన్ తో వచ్చిన నిర్మాత ప్రభాకర్ గారు.. అలాంటి నిర్మాత నుంచి వస్తున్న మొదటి సినిమా చాలా మంచి కథతో వస్తున్నారు. టీం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. అందరూ తప్పక చూసి ఆనందించండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. అన్నారు..
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా పోస్టర్ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది. నటీనటులు చాలా బాగా చేశారు. ఈ సినిమా అందరు తప్పక చూడండి. అన్నారు.
హీరో వినోద్ మాట్లాడుతూ.. సెల్ఫీ కాన్సెప్ట్ తో ఒక మంచి సినిమా చేసాం. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా చేశారు. అందరు నటీనటులు చాలా బాగా చేశారు. ఈ సినిమాని , మమ్మల్ని అశీర్వదించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరు ఈ సినిమాని తప్పక చూడండి. అన్నారు..
నటీనటులు : సానియా, సి.హెచ్. ప్రభాకర్ (చరణ్) , అనూష, వీర్ కరణ్, దిలీప్, సురేష్,కర్ణాటక శ్రీనివాస్, బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్, సుబ్బారెడ్డి.
సాంకేతిక నిపుణులు :
నిర్మాత & దర్శకుడు : సి.హెచ్. ప్రభాకర్ (చరణ్)
సహా నిర్మాత : పోతుమర్తి సతీష్ గాయ్ ఎమ్. ఏ, డి.ఎమ్.ఈ
బ్యానర్ : శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్
సమర్పణ : చెంచయ్య సుగుణమ్మ
మ్యూజిక్ : శ్రీనివాస్ మాలపాటి
సినిమాటోగ్రఫీ : జి.శ్రీకాంత్, పి.జాన్సన్, రెమో, కరణ్ చంద్ర
ఎడిటింగ్ : వీరు
రచయితలు : సి.హెచ్ .ప్రభాకర్, సతీష్ గాయ్, డి. లక్కీ, శ్రీరామ్ రెడ్డి సైకం..
డైరెక్షన్ డిపార్ట్ మెంట్ : సాగర్ చీకటిపల్లి, చోడవరపు లక్ష్మి, నాగభైరవ లీల