Advertisementt

ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతోంది

Fri 29th Mar 2019 07:36 PM
pooja hegde,confesses,mistake,bollywood movie  ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతోంది
Pooja Hegde feeling on Her Bollywood Movie ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతోంది
Advertisement
Ads by CJ

హీరోల లాంగ్‌రన్‌తో పోల్చుకుంటే హీరోయిన్లది చాలా తక్కువ. కేవలం సావిత్రి, శ్రీదేవి, నయనతార, విజయశాంతి, అనుష్క వంటి వారే ఎక్కువ రన్‌ సాధించారు. ఇక విషయానికి వస్తే నిన్నటి వరకు టాలీవుడ్‌ టాప్‌హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని కొట్టేసిన చిన్నది పూజాహెగ్డే. అందం, అభినయం.. ఇలా రెండు కలగలిసిన నటి ఆమె, గ్లామర్‌ షోకి కూడా నో చెప్పదు. ఇక ఈమె మొదటి చిత్రం తమిళంలో నటించింది. ఆ చిత్రం పేరు ‘మూగమూడి’. ఆ వెంటనే వరుణ్‌తేజ్‌ మొదటి చిత్రం ‘ముకుందా’లో, నాగచైతన్యతో కలిసి ‘ఒక లైలా కోసం’ చిత్రాలలో యాక్ట్‌చేసింది. ఈ రెండు చిత్రాలు సరిగా ఆడలేదు. 

దాంతో బాలీవుడ్‌కి వెళ్లి తన మాతృభాష హిందీలో హృతిక్‌రోషన్‌తో కలసి ‘మొహంజదారో’ చిత్రంలో యాక్ట్‌చేసింది. ఆ చిత్రం కూడా ఫ్లాప్‌ కావడంతో టాలీవుడ్‌కి వచ్చింది. అదే ఆమె కెరీర్‌ని మలుపుతిప్పింది. అల్లుఅర్జున్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘దువ్వాడ జగన్నాధం’ (డిజె)లో యాక్ట్‌ చేసింది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు. ‘రంగస్థలం’ లో ‘జిగేల్‌ జిగేల్‌ రాణి’, ‘సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ’లతో పాటు మహేష్‌ ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రూపొందుతున్న ‘మహర్షి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’కి ఓకే చెప్పింది. 

ఈమె తాజాగా మాట్లాడుతూ, ‘మొహంజదారో’భారీ బడ్జెట్‌ చిత్రం. అందునా స్టార్‌ హృతిక్‌రోషన్‌ సరసన నటించే అవకాశం. అందువల్లనే ఆ అవకాశాన్ని వదులుకోకూడదని భావించాను. ఈసినిమా హిట్‌ అయితే ఇక తిరుగుండదనేది నా ఆలోచన, అందుకే ఆ చిత్రానికి రెండేళ్లు డేట్స్‌ కేటాయించాను. అదే నేను చేసిన పెద్దతప్పు. ఆ సినిమా ఫ్లాప్‌ అయి నా కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆ సినిమాకి కేటాయించిన రెండేళ్లలో చిన్న సినిమాలు చేసినా బాగుండేది. ఓ ఆర్టిస్ట్‌కి రెండేళ్ల కాలం ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు ఆలోచిస్తే అర్దమవుతోంది..’ అని చెప్పుకొచ్చింది. నిజమే.. ప్రభాస్‌, మహేష్‌బాబు వంటి స్టార్‌ హీరోలు ఒకే చిత్రానికి ఎక్కువ డేట్స్‌ ఇచ్చినా ఫర్వాలేదు గానీ అదే హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం అది సరికాదనే చెప్పాలి. 

Pooja Hegde feeling on Her Bollywood Movie:

Pooja Hegde Confesses Her Mistake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ