Advertisementt

తెలుగమ్మాయ్‌కి ఛాన్సిచ్చిన క్రియేటివ్ దర్శకుడు

Fri 29th Mar 2019 12:17 PM
sekhar kammula,gives,chance,telugu actress  తెలుగమ్మాయ్‌కి ఛాన్సిచ్చిన క్రియేటివ్ దర్శకుడు
Telugu Heroine in Creative Director Film తెలుగమ్మాయ్‌కి ఛాన్సిచ్చిన క్రియేటివ్ దర్శకుడు
Advertisement
Ads by CJ

అచ్చ తెనుగుతనం ఉండే చిత్రాలను తీసే వారు కూడ తమ చిత్రాలలో హీరోయిన్ల విషయానికి వస్తే పరభాషా హీరోయిన్ల మీదనే ఆధారపడుతూ ఉంటారు. ఎందుకంటే సినిమాలలోకి తెలుగమ్మాయిలను ఒప్పించడం కష్టమని, ప్రతి విషయంలోనూ వారు కుటుంబ సభ్యుల సలహాల మీదనే ఆధారపడుతూ ఉంటారని, ఇక కొన్ని సీన్స్‌ చేయడానికి వారు ఒప్పుకోరనే వాదన ఉంది. అదే ముంబై భామలైతే నటనను ఓప్రొఫెషన్‌గా చేసుకుంటారంటారు. ఇందులో కూడా వాస్తవం ఉంది. అయినా పాత కాలంలో తెలుగు హీరోయిన్లకు కొదువ లేదు. ఇటీవల కాలంలో స్వాతి, నందిత, అంజలి.. వంటి వారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. 

ఇక విషయానికి వస్తే ఎక్కువగా కొత్తవారితో అద్భుతమైన చిత్రాలను తీసే దర్శకుల్లో సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల ఒకరు. ఆనంద్‌ నుంచి ఫిదా వరకు ఆయన ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. 2000లో డాలర్‌డ్రీమ్స్‌తో మొదలుపెట్టిన ఈయన ఆనంద్‌, గోదావరి, హ్యాపీడేస్‌, లీడర్‌, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌, అనామిక, ఫిదా చిత్రాలు తీశాడు. తీసేవి అచ్చ తెలుగు చిత్రాలైనా వాటి టైటిల్స్‌ని హ్యాపీడేస్‌, లీడర్‌, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ వంటి టైటిల్స్‌ పెట్టాడు. 

ఇక ఆయన కొత్తవారిని ఎందరినో పరిచయం చేశాడు. కానీ ఆనంద్‌లో కమలిని ముఖర్జీ నుంచి ఫిదాలో సాయిపల్లవి వరకు ఆయన చిత్రాలలో హీరోయిన్లు మాత్రం ఇతర భాషలకి చెందిన వారుంటారు. కానీ తాజాగా శేఖర్‌కమ్ముల తన కొత్త చిత్రంలో అచ్చమైన తెలుగమ్మాయికి చాన్స్‌ ఇస్తున్నాడట. ఈమె పేరు డింపుల్‌ హయాతి, మిస్‌ దివా టైటిల్‌ గెలిచిన ఈమె తెలుగు చక్కగా మాట్లాడుతుంది. పలు కమర్షియల్‌ యాడ్స్‌లో కూడా యాక్ట్‌ చేసింది.

అయితే శేఖర్‌కమ్ముల చిత్రమే ఆమెకి మొదటి చిత్రం కాదు. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గల్ఫ్‌’, తాజాగా ప్రభుదేవా, తమన్నాలు నటించగా విడుదల కానున్న ‘దేవి 2’లలో ఈమె నటించింది. కానీ ‘దేవి 2’లో సినిమా అంతా తమన్నా చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈమె పాత్రకి స్కోప్‌ ఉండే అవకాశం ఉండేది కాదు. మొత్తానికి ఈమె శేఖర్‌కమ్ముల కంట్లో పడింది. ఇక ఈమెకి తిరుగు ఉండదనే భావిద్దాం. 

Telugu Heroine in Creative Director Film:

Sekhar Kammula Gives Chance to Telugu Actress

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ