Advertisementt

అందుకే ఆమెను దూరం పెట్టా: సాయితేజ్

Thu 28th Mar 2019 07:48 PM
sai dharam tej,latest,interview,update  అందుకే ఆమెను దూరం పెట్టా: సాయితేజ్
Sai Dharam Tej Clarity about Friendship with his 1st Heroine అందుకే ఆమెను దూరం పెట్టా: సాయితేజ్
Advertisement
Ads by CJ

ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు వరస సినిమాల్లో నటించారు అంటే ఆ హీరో హీరోయిన్ కి లింక్ పెట్టేస్తారు సినీ ప్రియులు. వరసగా రెండు మూడు సినిమాలు చేస్తున్న హీరోహీరోయిన్స్ మధ్య ఏదో నడుస్తుంది... అందుకే ఆ హీరోగారు.. ఆ సదరు హీరోయిన్ కి వరసగా తన సినిమాల్లో అవకాశాలిస్తున్నాడు అంటూ ఊదరగొట్టేస్తారు. గతంలో సాయి ధరమ్ తేజ్ ని రెజీనాని అన్న గాసిప్ రాయుళ్లు.. మొన్నీమధ్యన నితిన్ కి మేఘ ఆకాష్ కి లింక్ పెట్టారు. అయితే సాయి ధరమ్ - రెజినా జంటపై మాత్రం రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. సాయి ధరమ్ తాను చేసిన మొదటి సినిమాలో రెజినానే హీరోయిన్. తర్వాత మరో సినిమాలో కలిసి నటించడంతో రేజీనాకి, సాయి ధరమ్ కి సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పేపర్స్ లోను, వెబ్ సైట్స్ లోను, సోషల్ మీడియాలో న్యూస్ లు విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

అయితే రెజినాతో ప్రేమ పెళ్లి విషయమై సాయి ధరమ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె పేరు బయటికి రానివ్వకుండా చాలా తెలివిగా స్పందించాడు. అయితే అప్పట్లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ చిత్రాల్లో రెజినాతో కలిసి నటించడంతో.. రెజినా మీద సాయి ధరమ్ మీద ప్రేమ పెళ్లి అనే న్యూస్ లు బాగా చక్కర్లు కొట్టాయి. నా మొదటి సినిమా హీరోయిన్ తో నేను కాస్త క్లోజ్ గా ఉండేవాడిని. ఎవ్వరికైనా ఫస్ట్ సినిమా హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ తో స్పెషల్ గానే ఉంటుంది. అందుకే నేను ఆ హీరోయిన్ తో ఫ్రెండ్లీగా ఉండేవాడిని. కానీ నాకు ఆ హీరోయిన్ కి లింక్ పెట్టి అర్ధం పర్ధం లేని న్యూస్ లు రావడంతో.. ఆమె కెరీర్ కి ఇబ్బంది రావొచ్చని నేనే ఆమె నుండి దూరంగా ఉంటున్నాను. కేవలం ఆ పుకార్ల వల్ల మా ఫ్రెండ్ షిప్ పాడవడం మాకు ఇష్టం లేకనే ఆమెకు దూరంగా ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. మరి నిజంగానే రెజినా మీద సాయి ధరమ్ మీద అలాంటి పుకార్లొచ్చాక వారు మళ్లీ ఎక్కడా కలిసి కనిపించనేలేదు. 

Sai Dharam Tej Clarity about Friendship with his 1st Heroine:

Sai Dharam Tej Latest Interview update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ