Advertisementt

డైరెక్టర్‌తో సాయిపల్లవి ప్రేమాయణం.. నిజమా?

Thu 28th Mar 2019 03:10 PM
sai pallavi,love,dating,director,vijay  డైరెక్టర్‌తో సాయిపల్లవి ప్రేమాయణం.. నిజమా?
Is Sai Pallavi In Love with this Director? డైరెక్టర్‌తో సాయిపల్లవి ప్రేమాయణం.. నిజమా?
Advertisement
Ads by CJ

సెలబ్రిటీలకు ఎన్ని ప్లస్‌ పాయింట్స్‌ ఉంటాయో అన్ని మైనస్‌ పాయింట్స్‌ కూడా ఉంటాయి. ఎవ్వరికీ దక్కని క్రేజ్‌, ఇమేజ్‌ వారి సొంతం. అది దేవుడిచ్చిన వరం. కోట్లలో అభిమానులను సంపాదించుకోవడం, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు సాధించడం అసాధారణ విషయం. కోట్లలో ఎవరో కొందరికి మాత్రమే ఈ గుర్తింపు, హోదా దక్కుతాయి. అదే మైనస్‌ పాయింట్స్‌ విషయానికి వస్తే వారిపై నానా రకాల వార్తలు, పుకార్లు హల్‌చల్‌ చేస్తూ ఉంటాయి. వారికంటూ ప్రైవసీ ఉండదు. వారిని వారి కుటుంబ సభ్యులను బాధించేలా పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. 

ఇక విషయానికి వస్తే శేఖర్‌కమ్ముల-దిల్‌రాజు కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫిదా’ చిత్రం సంచలనం సృష్టించింది. ఇందులో నటించిన వరుణ్‌తేజ్‌కంటే భానుమతి పాత్రను చేసిన సాయిపల్లవి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమెకి ‘ఫిదా’ స్థాయి హిట్‌ రాలేదు. కానీ ఈమె తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్‌తో ముందుకు సాగుతోంది. ఎక్స్‌పోజింగ్‌కి కూడా నో చెప్పే ఈమె తాజాగా ఓ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఈమె ఆమధ్య నాగశౌర్యతో కలిసి ‘కణం’ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ డైరెక్టర్‌. 

ఎ.ఎల్‌.విజయ్‌ విషయానికి వస్తే ఈయన అమలాపాల్‌ పేరు ద్వారా అందరికీ సుపరిచితుడు, అమలాపాల్‌ని వివాహం చేసుకుని ముణ్ణాళ్లు తిరగకుండానే ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక సాయిపల్లవి కణం చిత్రం షూటింగ్‌ నుంచి విజయ్‌తో ప్రేమలో పడిందని అంటున్నారు. విజయ్‌-అమలాపాల్‌ల వైవాహిక బంధం విఫలం కావడం వెనుక పెళ్లయిన తర్వాత అమలాపాల్‌ సినిమాలకు దూరంగా ఉండాలని విజయ్‌ పట్టుబట్టడమే కారణమని అంటారు. మరి విజయ్‌, సాయిపల్లవిల ఎఫైర్‌ కూడా నిజమేననుకుంటే వీరి వివాహం తర్వాత సాయిపల్లవి వెండితెరకు దూరం కావాల్సివుంటుంది. కానీ గతంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో తాను జీవతాంతం వివాహం చేసుకోనని చెప్పింది. మరి సాయిపల్లవి-విజయ్‌ల విషయంలో వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది? అనేది వేచిచూడాల్సివుంది....! 

Is Sai Pallavi In Love with this Director?:

Is Sai Pallavi Dating with This Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ