Advertisementt

‘సూర్యకాంతం’ ట్రైలర్ అదిరింది

Thu 28th Mar 2019 02:16 PM
niharika,rahul vijay,suryakantham,trailer,release  ‘సూర్యకాంతం’ ట్రైలర్ అదిరింది
Suryakantham Trailer Released ‘సూర్యకాంతం’ ట్రైలర్ అదిరింది
Advertisement
Ads by CJ

ఈనెల 29వ తేదీన మెగాడాటర్ కొణిదెల నిహారిక ప్రధానపాత్రలో రాహుల్‌ విజయ్‌ నటిస్తున్న ‘సూర్యకాంతం’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. నిహారిక సోదరుడు మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రణీత్‌ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్‌ పరంగానే కాకుండా టీజర్‌ ద్వారా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని ఏకంగా దిల్‌రాజు పంపిణీ చేస్తూ ఉండటం, ఎఫ్‌2, 118 తర్వాత ‘సూర్యకాంతం’తో తాను హ్యాట్రిక్‌ కొట్టనున్నానని, ఆల్‌రెడీ ఈ చిత్రాన్ని చూశానని చెప్పిన దిల్‌రాజు, నిహారిక, రాహుల్‌ విజయ్‌ల మీద ప్రశంసలు కూడా కురిపించిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మరింతగా ఆకట్టుకునేలా, సినిమాపై మంచి అంచనాలను పెంచేలా సాగడం విశేషం. ఈ చిత్రం కాన్సెప్ట్‌ని ట్రైలర్‌లో బయటపెట్టారు. సూర్యకాంతం, పూజా అనే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడైన అభి పాత్రలో రాహుల్‌ విజయ్‌ నటిస్తున్నాడు. ప్రధాన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలతో ఈ చిత్రం ట్రైలర్‌ని కట్‌ చేశారు. లవ్‌, కామెడీ, ఎమోషన్స్‌ని చూపిస్తూ కట్‌ చేసిన ఈ ట్రైలర్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. ఈ సినిమాకి టైటిల్‌ పాత్రను పోషిస్తోన్న ‘సూర్యకాంతం’ పాత్రధారి నిహారిక మెయిన్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇప్పటివరకు సరైన హిట్‌ లేని మెగాడాటర్‌కి ఈ చిత్రం అయినా మంచి విజయం అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. 

ఇక ఈనెల 29నే విడుదల కానున్న రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం కూడా విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, సూర్యకాంతం’ చిత్రాలు పూర్తిగా విరుద్దమైన జోనర్స్‌కి చెందినవి కావడం విశేషం. అయినా ఓపెనింగ్స్‌ విషయంలో మాత్రం ‘సూర్యకాంతం’  కంటే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Click Here For Suryakantham Trailer

Suryakantham Trailer Released:

Suryakantham Movie Trailer Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ