Advertisementt

గోవాకు గుడ్ బై చెప్పిన ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’

Thu 28th Mar 2019 12:08 PM
hero ram,puri jagannadh,ismart shankar,goa schedule,completed  గోవాకు గుడ్ బై చెప్పిన ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’
iSmart Shankar Goa Schedule Completed గోవాకు గుడ్ బై చెప్పిన ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’
Advertisement
Ads by CJ

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరో హీరోయిన్స్‌గా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్త‌య్యింది. 

నెల రోజులుగా గోవాలో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. 

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరో రామ్‌ను స‌రికొత్త కోణంలో చూపించ‌బోతున్నారు. 

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మాత‌లుగా మారి రూపొందిస్తున్న ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

రామ్, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌, పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌:  జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.

iSmart Shankar Goa Schedule Completed:

iSmart Shankar Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ