రాబోయే శుక్రవారం రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నో అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందు రాబోతుంది. అస్సలు ప్రమోషనల్ ఈవెంట్స్ లేకుండానే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి భీభత్సమైన క్రేజ్ ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను ఉంది. వర్మ ఆ రకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఇక ఈ శుక్రవారమే మరో మూవీ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా విడుదలకానుంది. అది మెగా డాటర్ నటించిన నిహారిక సూర్యకాంతం సినిమా. సూర్యకాంతం తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా.. సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా ప్రమోషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
నిన్నగాక మొన్న క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవకొండ సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరై సినిమాని పొగిడేసాడు. ఇక నిన్న విడుదలైన సూర్యకాంతం ట్రైలర్ చూస్తే సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేటయినట్లే అనిపిస్తుంది. ఈ సినిమాలో అడుగడుగునా నిహారిక డామినేషన్ కనబడుతుంది. పాత కాలంలో సూర్యకాంతం నోటికి భయపడేలా దర్శకులు ఆమెకి మాటలు రాసేవారు. అయితే దర్శకులు రాసిన డైలాగ్స్ కన్నా.. సూర్యకాంతం గయ్యాళిగా చెప్పే డైలాగ్స్ అదుర్స్ అన్న రీతిలో ఉండేవి. ఇక ఇప్పుడు ఈ మోడ్రెన్ సూర్యకాంతం కూడా నోరేసుకుని పడిపోతుంది.
రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందరి కళ్లు నిహారిక సూర్యకాంతం క్యారెక్టర్ మీదే ఉన్నాయి. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం నిహారిక చుట్టూనే తిరిగేలా కనబడుతుంది. హీరో విజయ్‌ని వేపుకు తినే కేరెక్టర్ లో సూర్యకాంతంగా నిహారిక రెచ్చిపోనుంది. మరి ట్రైలర్ చూశాక లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి ఈ కాంతం గారు గట్టిపోటీ ఇచ్చేలాగానే కనబడుతుంది.