Advertisementt

‘మన్మథుడు2’కు రెండు కోట్లు అడిగిందట!

Tue 26th Mar 2019 08:03 PM
rakul preet singh,manmadhudu 2,2 crores,demand,heroine rakul,nagarjuna  ‘మన్మథుడు2’కు రెండు కోట్లు అడిగిందట!
Heroine Demands 2 Crore for Manmadhudu 2 ‘మన్మథుడు2’కు రెండు కోట్లు అడిగిందట!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వరుస డిజాస్టర్స్ రకుల్ ప్రీత్ అవకాశాలకు గండికొట్టడం ఒక ఎత్తు అయితే.. టాప్ హీరోయిన్ గా వున్నప్పుడు అందుకున్న పారితోషకాన్ని క్రేజ్ లేని టైంలోను డిమాండ్ చేస్తూ రావడంతో.. వచ్చిన అవకాశాలు కూడా రకుల్ చేజారాయన్నది సోషల్ మీడియా టాక్. ఇక తమిళంలోనూ రకుల్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. కానీ బాలీవుడ్ లో మాత్రం రకుల్ కాస్త మెరుస్తుంది. అక్కడి అవార్డు ఫంక్షన్స్ లోను, రాంప్ వాక్స్ లోను రకుల్ వెలిగిపోతుంది. అక్కడ రెండు మూడు అవకాశాలు రకుల్ చేతిలో ఉన్నాయిగా అందుకే. 

అయితే తాజాగా రకుల్ ప్రీత్ తెలుగులో సీనియర్ హీరో నాగార్జున సరసన మన్మధుడు 2 సినిమాలో నటిస్తుంది. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 ని మొదలు పెట్టారు. రాహుల్ చెప్పిన కథకు బాగా కనెక్ట్ అయిన నాగార్జునే స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా... మొదట్లో నాగ్ సరసన రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే రకుల్ కాస్త భారీగా అంటే రెండు కోట్లు డిమాండ్ చేసిందట. 

రకుల్ ఆఫర్స్ లేని టైంలో వచ్చినదాన్ని కిమ్మనకుండా అంగీకరించకుండా... సీనియర్ హీరో పక్కన నటించాలంటే రెండు కోట్లు కావాలని డిమాండ్ చెయ్యడంతో.. తర్వాత రకుల్ ని పక్కనపెట్టి..... RX 100 భామ పాయల్ రాజపుట్ ని తీసుకుందామనుకున్నారట. కానీ పాయల్ క్రేజ్ కన్నా ఎక్కువగా రకుల్ ప్రీత్ కి క్రేజ్ ఎక్కువ ఉండడంతో.. ఆమెకి రెండు కోట్లు ఇచ్చి మరీ సినిమాలో పెట్టుకుందామని దర్శకుడు రాహుల్ చెప్పడంతోనే నాగార్జున రకుల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాడనేది తాజా సమాచారం.

Heroine Demands 2 Crore for Manmadhudu 2:

Rakul Preet Singh Demands 2 Crore for Manmadhudu 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ