ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న ‘నాగకన్య’ విడుదల
తెలుగు, తమిళ భాషల్లో క్రేజి భామలు వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటించారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా... ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. నాగకన్య బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. లవ్ అండ్ రొమాంటిక్ రివెంజ్ పాయింట్ తో ఈ చిత్రం అధ్బుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు.. .
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ లు కలిపి ఓకే చిత్రంలో మొట్టమొదటి సారిగా నటిస్తున్నారు. నాగకన్య ల లుక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటిలుక్ పోస్టర్ నుండి ట్రైలర్ నుండి ఆడియో జ్యూక్ బాక్స్ వరకూ అన్ని సిని ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి..అన్నికార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై క్యారెక్టర్ మరో హైలెట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అని అన్నారు.