మేడమ్ టుసాడ్స్ రూపొందించిన సూపర్ స్టార్ మహేష్ వ్యాక్స్ స్టాట్చ్యుని హైదరాబాద్‌లోని ఏఎంబీలో సోమవారం ఉదయం సూపర్ స్టార్ మహేష్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మేడమ్ టుస్సాడ్స్ తరఫున అలెక్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ.. ‘‘నా విగ్రహాన్ని హైదరాబాద్‌లో, ఇక్కడి సినీ ప్రియుల మధ్య విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. గతేడాది వాళ్లు నన్ను సంప్రదించారు. రకరకాల కళ్లను, రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి నాకు పోల్చి చూశారు. అదంతా మామూలుగా చేస్తున్నారని, కొలతలు తీసుకుంటున్నారని అనుకున్నా. కానీ వారు విగ్రహాన్ని మలిచిన తీరు చాలా బావుంది. నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. ఒకసారి వాళ్లు ఆ ఫొటోలను నాకు పంపించారు. వాటిని నా భార్యతోనూ, కొంతమంది సన్నిహితులతోనూ పంచుకున్నాను. వాటిని చూసిన వారు నేనేదో సినిమాకు ఫొటో షూట్ చేశానని అనుకున్నారు. అంత బాగా ఉంది స్టాట్యూ. ప్రాణం పోసినట్టుగా చేసిన ఇవాన్ రీజ్, బెంటానా తదితర టీమ్‌కు ధన్యవాదాలు. నాకు నా విగ్రహాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్పగా, ఉత్కంఠగా, ఒకింత భయంగా, అన్నీ భావాలు కలగలిసినట్టుగా ఉంది. భారతదేశానికి చెందిన పలువురు సెలబిట్రీల బొమ్మలు అక్కడున్నాయని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాలని కూడా అనుకుంటున్నా’’ అని చెప్పారు.
మేడమ్ టుస్సాడ్స్ అలెక్స్ మాట్లాడుతూ.. ‘‘యునిక్ అకేషన్ ఇది. తొలిసారి మేం ఒకవ్యాక్స్ స్టాట్చ్యుని సింగపూర్ కాకుండా, మరోచోట విడుదల చేస్తున్నాం. తొలిసారి మేం హైదరాబాద్‌కు వచ్చాం. తెలుగు సినిమా స్టార్ స్టాట్యూని సింగపూర్‌లో విడుదల చేయడం కూడా ఇదే తొలిసారి. మహేష్‌ని ఎంతో మంది రిఫర్ చేశారు. మా టీమ్ 20 మంది ఆరు నెలలు కష్టపడి ఈ స్టాట్యూని చేశారు. దాదాపు మహేష్‌కి సంబంధించిన 200 మెజర్మెంట్స్ తీసుకున్నారు. కంటిపాప నుంచి అన్నీ కొలతలు తీసుకున్నారు. షారుఖ్‌ఖాన్, అమితాబ్‌బచ్చన్, ఇప్పుడు మహేష్‌బాబు స్టాట్యూని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
ఏవీయంగ్ కాంగ్ మాట్లాడుతూ.. ‘‘మహేష్ స్టాట్చ్యుని చూడటానికి సింగపూర్‌కి వస్తారని భావిస్తున్నా’’ అని అన్నారు.
మహేష్ మైనపు విగ్రహాన్ని చూసిన నమ్రత స్పందిస్తూ.. ‘‘నాకు ఇద్దరు భర్తలను చూసినట్టు ఉంది. రియల్ గా ఉన్న వ్యక్తి అందంగా ఉన్నారు. స్టాట్యూలో ఉన్న వ్యక్తి ఆయనంత అందంగా ఉన్నారు’’ అని అన్నారు.
ఆ తర్వాత జరిగిన ప్రశ్నజవాబుల కార్యక్రమం వివరాలు...
* మహేష్, ఇది వరకు ఎప్పుడైనా మేడమ్ టుసాడ్స్ వెళ్లారా? అప్పుడు మీకు ఎలా అనిపించింది?
ఆరేళ్ల క్రితం లండన్‌లో మ్యూజియమ్‌కి వెళ్లాను. నా పిల్లలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అక్కడ ఉన్న మైనపు విగ్రహాలతో ఫొటోలు తీసుకున్నారు. వాళ్లను చూసిన తర్వాత ఎప్పుడో ఒకరోజు నా బొమ్మ ఇక్కడికి వస్తుందని అనుకున్నా. ఇప్పుడు అది జరిగింది. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ కి ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది.
* అలెక్స్... సింగపూర్‌కి బయట తొలిసారి ఈ స్టాట్చ్యుని విడుదల చేయడానికి కారణం ఏంటి?
- నిజమే. తొలిసారి మేం ఇలా ఆవిష్కరిస్తున్నాం. మహేష్ ఇక్కడ చాలా పెద్ద సూపర్‌స్టార్. ఆయన ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండాలని చేశాం.
* హైదరాబాద్ సిటీ ఎలా ఉంది?
- హైదరాబాద్ చాలా బావుంది. ప్రజలు ఈ లాంచ్ కి సపోర్ట్ చేయడం చాలా బావుంది.
* మీ మైనపు ప్రతిమను చూస్తుంటే ఏమనిపిస్తోంది మహేష్?
- చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ వాళ్లు ఇంత బాగా చేశారు. మా పిల్లల ముందు విడుదల చేయడం చాలా బావుంది. టీమ్‌కి థాంక్యూ.
* ‘మహర్షి’ గురించి చెప్పండి?
- నా 25వ సినిమా. నా బిగ్గెస్ట్ సినిమా అవుతుంది.
* మీ బొమ్మతో మీకు మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడుతారు?
- ఎలా ఉన్నావు.. బావున్నావా.. అని మాట్లాడుతా. (నవ్వుతూ) స్టాట్చ్యు చాలా బావుంది.
* మీ ఐ, హెయిర్ అలాగే చేశారు? ఎలా సాధ్యమైంది?
- మెజర్మెంట్స్ అని ఒకసారి వచ్చారు. సరేనని ఇచ్చాను. కానీ ఇంత డీటైలింగ్‌గా ఉంటుందని అనుకోలేదు. నా పాదం సైజ్, నా చేతుల సైజు, నా రంగు, నా చర్మం, నా గోళ్లు... ఇలా అన్నీ నాలాగే ఉన్నాయి.
* ఇక మీకు సెల్ఫీ డిమాండ్ తగ్గుతుందేమో?
- నాకు సెల్ఫీలు వచ్చినా నా బొమ్మకు సెల్ఫీలు వచ్చినా సేమే కదా.
* ఈ బొమ్మను చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?
- 20 మంది 6 నెలలు పనిచేశారు. చాలా కేర్ తీసుకుని చేశారు.
* ఇలాంటివన్నీ సింగపూర్‌లో పెడతారు. మరి హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు?
- నా షెడ్యూల్స్ టైట్ వల్ల అక్కడికి వెళ్లడానికి కుదరలేదు. అందుకే వాళ్లు ఇక్కడికి వచ్చారు. అది హానర్. నా పిల్లల ముందు దీన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.
* మీ సినిమాల్లో ఈ స్టాట్యూని చూడొచ్చా?
- సింగపూర్ మ్యూజియమ్‌కి వెళ్లి చూడొచ్చు. సినిమాల్లో కాదు.
* మహేష్ స్టాట్యూని చేయడానికి కారణం ప్రత్యేకంగా ఏదైనా?
- ప్రపంచంలోని పలువురు చేసిన రిక్వెస్ట్ కారణంగా మేం ఇది చేశాం.
* మీ స్టాట్యూ పెడుతున్నారని తెలియగానే.. ఇంట్లో వాళ్లు ఏమన్నారు?
- మా ఆవిడ ఈ విషయాన్ని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. నాకు ఏదో అచీవ్ చేసినట్టు అనిపించింది.
* మైనపు విగ్రహం చూడగానే ఇద్దరు భర్తలున్నారని నమ్రత అన్నారు.
- ఇద్దరు మహేష్బాబులున్నారని ఆవిడ మాటకు అర్ధం అండీ.
* మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?
* చాలా చాలా గౌరవంగా, థ్రిల్‌గా, ఆనందంగా ఉంది.
* ఈస్టాట్యూని చేయడానికి మీరేమైనా సజెషన్స్ ఇచ్చారా?
- అలాంటిదేమీ లేదు.
* ఈ లుక్ ఏ సినిమాలోది?
- ఈ లుక్ శ్రీమంతుడులో లుక్. శ్రీమంతుడులో ఆ పోజు బావుందని చెప్పి, అలా పోజు ఇవ్వమని అడిగారు. అలాగే ఇచ్చాను. నా అన్నీ ఫొటోలు చూశారు. ఏది బావుంటే, దాన్ని బట్టి తీసుకున్నారు.
* భరత్ అనే నేను తర్వాత హాలిడే వెళ్లారు. మహర్షి తర్వాత ఏంటి?
- ఇంకా పెద్ద హాలిడేకి వెళ్తాం. ఎందుకంటే ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.