ఆర్ఎక్స్ 100 బ్యూటీకి షాకిచ్చారు

‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. టైగర్ నాగేశ్వర్ రావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు.
ఆ కథతోనే సినిమాను తెరకెక్కించనున్నారు. ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేమ్ దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను తీసుకుంద్దాం అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాలేదు అంట.
ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు అని తెలుస్తుంది. బెల్లంకొండకు రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయ్ ఆ రెండు అయిపోయిన తరువాత ఈసినిమా ఉండబోతుంది. దీనికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. త్వరలోనే ఈసినిమా డీటెయిల్స్ తెలియనున్నాయి.
Payal Rajput out in Bellamkonda srinivas Film
Shock to RX 100 Heroine Payal Rajput






































