ఏపీ రాజకీయాల్లో తన వంతు భూమికని పోషిస్తూ టీడీపీ, వైసీపీలకు ధీటుగా తరయారవుతున్నారు పవన్‌కల్యాణ్. ఎన్నికల నగారా మోగిన దగ్గరి నుంచి క్షణం తీరిక లేకుండా వరుస సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారాయన. ఈ రోజు కృష్ణా జిల్లాలో తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారానికి వెళ్లిన జనసేనాని సామాన్యుడిలా మారిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన స్టార్ హోదాను పక్కన పెట్టి క్రియాశీ రాజకీయాల్లోకి ఎంటరైన పవన్ తన సింపుల్ సిటీని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
స్టార్ హీరోగా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా మంచి రైజింగ్‌లో వున్నా స్టార్ హోటళ్లో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించే వీలున్నా కటిక నేల పై కూర్చుని ఓ సామాన్యుడిలా పవన్‌కల్యాణ్ భోజనం చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది. కృష్ణాజిల్లా మంగనపూడి బీచ్ లైట్ హౌజ్ వద్ద గల ఓ చెట్టుకింది నేలపై కూర్చుని మట్టి పాత్రలో పవన్ భోజనం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జొన్న అన్నం మజ్జిగలో కలుపుకుని పచ్చిమిరపకాయ్ పచ్చడిని నంజుకుంటూ పవన్ భోజనం చేశారు. భోజనం పూర్తయిన తరువాత అక్కడే ఏర్పాటు చేసిన తాటాకు చాపపై పవన్‌కల్యాణ్ సేదతీరిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.