ఈ ఏడాది సమ్మర్ పోటీ ఏప్రిల్ 5న ‘మజిలీ’తో ప్రారంభం కానుంది. ఇటీవల వరుస పరాజయాలలో ఉన్న నాగచైతన్య, పెళ్లయిన తర్వాత సమంతతో నటిస్తున్న చిత్రం కావడం, నిన్నుకోరి వంటి మంచి చిత్రాన్ని తీసిన శివనిర్వాణ దర్శకుడు కావడం, ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగా జరగడం, సినిమాపై మంచి ఆశలే ఉన్నాయి కాబట్టి ‘మజిలీ’తో తన కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకంతో చైతు ఉన్నాడు. ఇక వరుసగా డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ ఎదుర్కొన్న సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ 12న విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫీల్‌గుడ్ చిత్రం కావడంతో దీనిపై సాయి బాగానే నమ్మకం పెట్టుకుని ఉన్నాడు.
ఇక 19న నాని ‘జెర్సీ’ విడుదల కానుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ప్రయోగాత్మక కమర్షియల్ చిత్రంగా ఇది మంచి ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని ఆశపడే మధ్యవయస్కుడి పాత్రలో నేచురల్ స్టార్ ఇందులో నటిస్తున్నాడు. చిత్రానికి 25కి అటు ఇటుగా బడ్జెట్ కాగా, ఈ చిత్రం అన్నివైపుల నుంచి ఇప్పటికే 40కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం.
ఇక 25న తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ నటించిన ‘సీత’, అల్లుశిరీష్ మలయాళ రీమేక్ ‘ఎబిసిడి’ వంటివి కూడా తమ తమ కెరీర్స్‌లో బెస్ట్‌గా నిలుస్తాయని ఈ హీరోలందరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపిఎల్ మధ్యలో వీరి కోరిక నెరవేరుతుందా? లేదా? అనేవి వేచిచూడాల్సివుంది..!