Advertisementt

సూర్యకాంతం పెద్ద హిట్టవ్వాలి: విజయ్ దేవరకొండ

Sun 24th Mar 2019 11:24 PM
niharika,suryakantham movie,vijay deverakonda,pre release,event highlights  సూర్యకాంతం పెద్ద హిట్టవ్వాలి: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda Wishes to Suryakantham Team సూర్యకాంతం పెద్ద హిట్టవ్వాలి: విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం ‘సూర్య‌కాంతం’. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ శ‌నివారం హైద‌రాబాద్‌ జె‌ఆర్‌సిలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తొలి టిక్కెట్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండకు నీహారిక గిఫ్ట్ ఇచ్చారు. అనంతరం సూర్యకాంతం ఆడియో సీడీలను విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.

దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘విజ‌య్ మాస్ట‌ర్ లాస్ట్ సినిమా చేసిన‌ప్పుడు నాకు చూపించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్పుడు కుద‌ర‌లేదు. ఈ సినిమా టీజ‌ర్ చూడ‌గానే థ్రిల్ ఫీల‌య్యా. వ‌రుణ్ సినిమా ఓపెనింగ్ అప్పుడు నీహారిక పాత్ర బావుంద‌ని చెప్పా. లేడీ అర్జున్‌రెడ్డి లాగా బాగా చేశావ‌ని అన్నా. వ‌రుణ్‌తో మాట్లాడిన‌ప్పుడు అత‌ను తానే ప్రెజెంట్ చేస్తున్న‌ట్టు చెప్పాడు. సినిమా పూర్తి కాగానే చెప్ప‌మ‌ని నేను చెప్పాను. త‌ను చెప్పేలోపే నేనే 15-20 రోజుల‌కు మ‌ళ్లీ అడిగా. ‘ఏమైంది సినిమా ఇంకా రెడీ కాలేదా’ అని. అప్పుడు సందీప్‌కి, వ‌రుణ్ ఫోన్ చేసి సినిమా చూడ‌మ‌ని చెప్పారు. నిర్మాత‌లు నాలాగే సుడిగ‌ల‌వాళ్లు. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. ఈ నెల 29న ఏపీ, తెలంగాణ‌లో మా ద్వారా విడుద‌ల కానుంది. ఈ ఇయ‌ర్ మా బ్యాన‌ర్‌లో ఇది మూడో హిట్ కావాల‌ని ఆకాంక్షిస్తున్నా. కొత్త డైర‌క్ట‌ర్ అయినా క్యార‌క్టర్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా పూర్త‌య్యాక ఇంటికి వెళ్లి నేను ‘అబ్బాయి ఎవ‌రు’ అని అడిగా. విజ‌య్ మాస్ట‌ర్ వాళ్ల కొడుకు అని చెప్పారు. ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య‌లో స్ట్ర‌గుల్ అవుతూ రాహుల్ చేసిన తీరు న‌న్ను ఆక‌ట్టుకుంది. రాహుల్‌లో ఆ టాలెంట్ ఉంది కాబ‌ట్టి నేను ఎంక‌రేజ్ చేస్తున్నా. నా లైఫ్‌లోనే కాదు, ఎవ‌రి లైఫ్‌లోనూ సూర్య‌కాంతం ఉండ‌కూడ‌దు’’ అని అన్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. ‘‘నేను నీహారిక వాళ్ల నాన్న‌తో ప‌నిచేశాను. ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న్ని చూస్తే నాన్న ఫీలింగ్ వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఆయ‌న‌తో ప‌నిచేసిన‌ప్పుడు న‌న్ను చూసి ‘నువ్వు మంచోడివేన‌య్యా’ అని అన్నారు. ఈ రోజు నాగ‌బాబుగారు పొలిటిక‌ల్ వ‌ర్క్ లో ఉండి, వ‌రుణ్ యుఎస్‌లో ఉండి, చ‌ర‌ణ్ అన్న యుఎస్‌లో ఉండి.. ఇక్క‌డికి రాలేక‌పోయార‌ని తెలిసింది. నేను నాగ‌బాబుగారి కొడుకుగా న‌టించా. అందుకే నీహారిక‌కు అన్న‌గా ఇక్క‌డికి వ‌చ్చాను. నేను రాహుల్ తండ్రితోనూ ప‌నిచేశా. ఒక సినిమాలో నా ఫైట్‌ని ఆయ‌న కొరియోగ్రాఫ్ చేశారు. టీజ‌ర్ చాలా బావుంది. సృజ‌న్‌, సందీప్ నా ‘అర్జున్ రెడ్డి’ని యు.ఎస్‌.లో విడుద‌ల చేశారు. వాళ్ల‌కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి మాట్లాడుతూ.. ‘‘సినిమా గురించి చెప్పాలంటే... అది చాలా ట‌ర్న్స్ తీసుకుంది. దిల్‌రాజు గారికి థ్యాంక్స్. దిల్‌రాజు గారికి సినిమా అంటే ఎంత ఇష్ట‌మో, నాకు సినిమా అంటే అంత ఇష్టం. ఆయ‌న సినిమా చూసి తీసుకున్నారు. అందుకే మాకు చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెష‌ల్ సినిమా. వ‌రుణ్ అన్న నాకు గైడింగ్ ప‌ర్స‌న్‌. నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. వాళ్లు మాతో అన్న‌ద‌మ్ములుగానే ఉన్నారు. మా కెమెరామేన్ నా ప‌నిని ఈజీ చేశారు. నేను చాలా ఇబ్బంది పెట్టింది రాబిన్‌ని. అత‌నితోనే ఉంటున్నా. కె.కె.గారు సింగిల్ కార్డు రాశారు. 15 నిమిషాల్లో ఒక పాట రాశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మా సూర్య‌కాంతం నాకు ప‌ర్ఫెక్ట్ మోటివేష‌న్‌. త‌ను పెర్ఫార్మెన్స్ చింపేసింది. రాహుల్ విజ‌య్ నాకు బ్ర‌ద‌ర్‌లాంటివాడు. అత‌న్ని సెట్‌లో స‌తాయించేశాను. పూజా క్యార‌క్ట‌ర్‌లో ప‌ర్లిన్ చాలా బాగా చేసింది’’ అని అన్నారు.

సందీప్ మాట్లాడుతూ.. ‘‘విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ గారికి, దిల్‌రాజు గారికి, వ‌రుణ్‌తేజ్‌ గారికి ధ‌న్య‌వాదాలు. రామ్ న‌రేష్ అని ఒక నిర్మాత ఇక్క‌డికి రాలేదు. ఆయ‌న మాకు చాలా స‌పోర్ట్ చేస్తున్నారు. నాకు, కిర‌ణ్‌, స‌్వాతి, గౌత‌మ్ మంచి ఫ్రెండ్స్. ప్ర‌ణీత్ మాకు ఈ ప్రాజెక్ట్ చెప్పిన‌ప్పుడు చాలా బావుంద‌ని అనిపించింది. ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ నాకు చాలా బాగా న‌చ్చింది. అప్పుడే ‘ఫ్యూచ‌ర్‌లో సినిమా చేద్దాం’ అని ప్ర‌ణీత్‌తో అన్నా. కొన్నాళ్ల‌కు ఆయ‌న క‌థ చెప్పారు. రాబిన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ అంద‌రికీ ధ‌న్యవాదాలు. సినిమా చూశా. చాలా బాగా వ‌చ్చింది. రాహుల్ చాలా అమాయ‌కంగా ఉంటాడు. అత‌నికి ఈ సినిమా మంచి బ్రేక్ కావాలి. క‌న్నారావుగారి ద‌గ్గ‌ర నుంచి టైటిల్ తీసుకున్నాం. రాజ్ నిహార్ చాలా బాగా చూసుకున్నారు. అత‌ను లేకుంటే ఇక్క‌డ మా ప‌నులేవీ కావు’’ అని అన్నారు.

Vijay Deverakonda Wishes to Suryakantham Team:

Suryakantham Movie Pre Release Event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ