Advertisementt

వర్మ ఈ జంటను ఇబ్బంది పెట్టేస్తున్నాడా?

Sun 24th Mar 2019 11:02 PM
ram gopal varma,trouble,majili movie,naga chaitanya,samantha,lakshmis ntr  వర్మ ఈ జంటను ఇబ్బంది పెట్టేస్తున్నాడా?
RGV Creates Trouble to These Cine Couple వర్మ ఈ జంటను ఇబ్బంది పెట్టేస్తున్నాడా?
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ, సమంత - నాగ చైతన్య జంటగా నటించిన మజిలీ సినిమా చిక్కుల్లో పడడమేమిటా అని ఆలోచిస్తున్నారా. మరి తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఆపడానికి సెన్సార్ వారు ప్రయత్నిస్తే.. సెన్సార్ తో పోరాడి మరీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ చేసేందుకు ఒప్పించాడు. మరి రేపు శుక్రవారం విడుదలకాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి రేపో మాపో సెన్సార్ జరుగుతుంది. అయితే వర్మ వలన మజిలీకి కూడా సెన్సార్ దెబ్బ పడేలా కనబడుతుంది. మజిలీ సినిమాని శివ నిర్వాణ క్లిన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. అలాంటప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్ ఏముంటుందా అనే ఆలోచన కూడా వస్తుంది కదా... వస్తుంది మరి. ఎందుకంటే మజిలీ సినిమాలో లిప్ లాక్ లు, వల్గర్ సన్నివేశాలు ఏం ఉండవు.

అయితే రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డు వారు రూల్స్ ని అతిక్రమిస్తున్నారంటూ... బాహాటంగా చేసిన విమర్శలతో దిగొచ్చిన సెన్సార్ బోర్డు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని సెన్సార్ కోసం రూల్స్ ప్ర‌కారం అప్లై చేసుకుంటే సెన్సార్ చేస్తామ‌ని చెప్పిందట బోర్డు. ఇక సెన్సార్ బోర్డు చెప్పినట్టుగా తన సినిమాకి సెన్సార్ చెయ్యాలంటూ బోర్డు దగ్గర అప్లై చేసాడట. ఇక ఆ రూల్ ప్రకారం లక్ష్మీస్ ఎన్టీఆర్ రేపు వచ్చేవారం మొదట్లో సెన్సార్ చేసుకుంటుంది. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కి మాత్రమే ఈ రూల్ కాదు.. మిగతా అన్ని సినిమాలకు అదే రూల్ అంటూ ఢిల్లీ నుండి ఆర్డర్స్ రావడంతో.. ఇప్పుడు ఎవరు ముందు తమ సినిమా సెన్సార్ కోసం అప్లై చేసుకుంటే ఆ సినిమాని ముందుగా సెన్సార్ చేస్తారు.

మరి అలా అనుకోకుండా మజిలీ సినిమా లేట్ గా సెన్సార్ వారికీ అప్లై చేసుకోవడంతో.. లిస్ట్ లో కాస్త వెనకబడి ఉండడంతో.. ఇప్పుడు అంజలికి సెన్సార్ వలన కాస్త ఇబ్బంది తప్పేలా కనబడడం లేదు. సినిమా విడుదలకు కేవలం పది రోజుల టైం మాత్రమే ఉంది. ఇక సెన్సార్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏప్రిల్ రెండు మూడు తారీఖులు అయ్యేలా కనబడుతుంది. మరి సెన్సార్ లేట్ అయితే.. మజిలీ సినిమాకి ఓవర్సీస్ లో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సినిమాకి సెన్సార్ త్వరగా అయ్యాక రెండు మూడు రోజుల ముందే సినిమా ప్రింట్ ఓవర్సీస్ కి వెళ్ళాలి. మరి సెన్సార్ లేట్ చేస్తే...ఇబ్బంది కదా.. అందుకే మజిలీ టీంకి ఇప్పుడు సెన్సార్ టెంక్షన్ ఎక్కువైందట.

RGV Creates Trouble to These Cine Couple:

Chai and Sam Majili vs RGV Lakshmis NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ