Advertisementt

‘ఐరా’ అదిరిపోయే లెవెల్లో వస్తోంది

Sun 24th Mar 2019 10:58 PM
nayanthara,airaa movie,release,march 28  ‘ఐరా’ అదిరిపోయే లెవెల్లో వస్తోంది
Airaa Ready to Grand Release ‘ఐరా’ అదిరిపోయే లెవెల్లో వస్తోంది
Advertisement
Ads by CJ

న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన‌ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ హార‌ర్ చిత్రం ‘ఐరా’ భారీ విడుద‌ల‌కు స‌ర్వం స‌న్న‌ద్ధం!

‘‘అంద‌రికీ సంతోషంగా బ‌త‌క‌డం ఒక క‌ల‌. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియ‌ని నాకు బ‌త‌క‌డమే ఒక క‌ల‌.. అని మా ‘ఐరా’ టీజ‌ర్‌లో వినిపించే డైలాగులు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి’’ అని న‌య‌న‌తార తెలిపారు. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన  ‘ఐరా’ ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేశారు.  గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది.  స‌ర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  

గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ అధినేత‌లు మాట్లాడుతూ... ‘‘ఇటీవ‌ల కాలంలో న‌య‌న‌తార ఎంపిక చేసుకుంటున్న మ‌హిళా ప్రాధాన్య‌మున్న చిత్రాల‌న్నీ విజ‌యం సాధిస్తున్నాయి. న‌య‌న‌తార లేడీ ఓరియంటెడ్ స‌బ్జెక్ట్ ఓకే చేశార‌ని తెలియ‌గానే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆ ప్రాజెక్ట్ మీద ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. అలా మా ‘ఐరా’కు ముందు నుంచే హైప్ వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ హార‌ర్ చిత్రంగా మా దర్శ‌కుడు మ‌లిచారు. ఇందులో భ‌వాని, య‌మున పాత్ర‌ల్లో ఆమె న‌ట‌న హైలెట్‌గా ఉంటుంది. భ‌వానీ పాత్ర కోసం ఆమె వేసుకున్న మేక‌ప్ కూడా ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టికే న‌చ్చింది. ఈ నెల 28న అత్యంత భారీగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా మా చిత్రాన్ని 300ల‌కు పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తాం’’ అని అన్నారు. 

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ... ‘‘న‌య‌న‌తార‌లాంటి గ్లామ‌ర్‌, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లేడీ... భ‌వాని పాత్రలో ఎలా ఉంటారోన‌ని అనుకున్నాం. అయితే ఆమె మేక‌ప్ వేసుకుని, ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా కాస్ట్యూమ్స్ ని ఎంపిక చేయ‌మ‌ని మా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌తో చెప్పి, యాక్స‌స‌రీస్ కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయిలాగా వేసుకుని, సింపుల్‌గా న‌టించ‌డం మ‌మ్మ‌ల్ని విస్మ‌యానికి గురి చేసింది. టీజ‌ర్‌లో వినిపించిన  ‘మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టిందిరా... అయ్యో ఆడ‌పిల్లా.. పేరేంటి?... భ‌వాని.. నేను చెప్పానుగా, నీకోసం వ‌స్తాన‌ని చెప్పానుగా.. నాకే తెలియ‌ని ఎవ‌రో ఆరుగురు నా త‌ల‌రాత‌ను త‌ల‌కిందులుగా రాశారు.. మా.. భ‌యంగా ఉంద‌మ్మా’... వంటి ప్ర‌తి డైలాగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకునే సినిమా అవుతుంది. హార‌ర్‌, థ్రిల్ల‌ర్ అంశాల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే భావోద్వేగాలుంటాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ హార‌ర్ చిత్రం ‘ఐరా’. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో లోతైన భావోద్వేగాల‌ను న‌య‌న‌తార ప‌లికించిన తీరుకు అంద‌రూ ముగ్ధుల‌వుతారు. చాలా స్ట్రాంగ్ క్యార‌క్ట‌ర్లున్న చిత్ర‌మిది. ‘ఐరా’ అనే పేరుకు త‌గ్గ‌ట్టే సినిమా కూడా స్ట్రాంగ్ కంటెంట్‌తో అల‌రిస్తుంది’’ అని అన్నారు. 

న‌టీన‌టులు..

కళైయ‌ర‌సి,  యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు...

కెమెరా:  సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,

కూర్పు:  కార్తిక్ జోగేష్‌,

స్క్రీన్‌ప్లే:  ప్రియాంక ర‌వీంద్ర‌న్‌

సంగీతం:  సుంద‌రమూర్తి. కె.ఎస్‌.  

Airaa Ready to Grand Release:

Nayanthara Movie Airaa Release on March 28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ