Advertisementt

నిహారిక కోరిక తీరింది..!

Sun 24th Mar 2019 07:24 PM
niharika,campaign,janasena,pawan kalyan,sye raa movie,chiranjeevi  నిహారిక కోరిక తీరింది..!
Niharika in Sye Raa Narsimha Reddy నిహారిక కోరిక తీరింది..!
Advertisement
Ads by CJ

ఇక ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు ఒక్క సీన్‌లోనైనా నటించాలని ఆశపడుతున్నారు. పలువురి పేర్లు ప్రచారంలోకి కూడా వచ్చాయి. అందులో మెగాడాటర్‌ నిహారిక కూడా ఉంది. తాజాగా ఆమె ‘సూర్యకాంతం’ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈనెల 29న సినిమా విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్‌ సందర్భంగా నిహారిక తన వ్యక్తిగత విషయాలను తెలుపుతూ, ఇండస్ట్రీలో 15, 20ఏళ్లు హీరోయిన్‌గా వెలిగిపోవాలని నేనే ఈ రంగంలోకి రాలేదు. పెద్ద పెద్ద హీరోలతో నటించాలని కలలు కనలేదు. స్టార్‌ హీరోల చిత్రాలలో అవకాశం కోసం ఎదురుచూడటం లేదు. ఎందుకంటే ముప్పై ఏళ్లు వచ్చేలోపు పెళ్లి చేస్తామని ఇంట్లో వారు ముందుగానే చెప్పారు. అందువలన నాకున్న సమయం చాలా తక్కువ. 

ఈలోగా నా మనసుకి నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు అందరి కంటే పెద్ద హీరో అయిన చిరంజీవి గారితో నటించాలని ఉంది. పెదనాన్నతో ‘సై..రా’లో నటిస్తున్నాను. ఆ విధంగా ఆకోరిక తీరింది. ఇంతకు మించి నాకు పెద్ద ఆశలు లేవని చెప్పుకొచ్చింది. సో.. ‘సై..రా’ చిత్రంలో మిగిలిన మెగాహీరోల సంగతేమో గానీ నిహారిక నటిస్తున్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇక ఈమె తన సోదరుడు వరుణ్‌తేజ్‌తో కలిసి తమ నాన్న పోటీ చేస్తున్న నరసాపురం ఎంపీ స్థానంలో, ఇతర ప్రాంతాలలో కూడా తమ బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ జనసేనకి మద్దతుగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. 

Niharika in Sye Raa Narsimha Reddy:

Niharika Campaign for Janasena 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ