మెగాస్టార్ చిరంజీవి తన 151వ ప్రతిష్టాత్మక చిత్రంగా, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ‘సై..రా.. నరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నాడు. కొణిదెల బేనర్‌లో బడ్జెట్ లిమిటేషన్స్ లేకుండా స్వయంగా మెగాస్టార్ తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేయాలని కష్టపడుతున్నారు.
కానీ అదే డేట్‌ని ప్రభాస్ ‘సాహో’ కూడా ప్రకటించుకుంది. ఇదే జరిగితే ‘సై..రా’చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పెద్దగా అప్‌డేట్స్ లేకుండానే ఈ చిత్రం షూటింగ్‌ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా, జగపతిబాబు వంటి భారీ తారాగణం నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం యూనిట్ చైనాకి వెళ్లనుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్‌ని ప్లాన్ చేశారట.
చిరంజీవి తదితరులపై ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను చైనాలో 20రోజులు చిత్రీకరిస్తారని అంటున్నారు. ఈ పోరాటాలు చిత్రానికి హైలెట్ అవుతాయని, అందుకే చైనాలో భారీ ఎత్తున చిత్రీకరించనున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ చైనా షెడ్యూల్ ప్రారంభం కానుంది.