రాజమౌళి డైరెక్షన్‌లో ఇద్దరు హేమ హేమీలు అయిన స్టార్ హీరోస్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న RRR మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను ఒకరిని కొమరం భీమ్ (ఎన్టీఆర్) ఒకరిని అల్లూరి సీతారామరాజు(రామ్ చరణ్) గా చూపిస్తున్నానని చెప్పాడు. మరి ఎన్టీఆర్ బొద్దుగా కొమరం భీమ్ లో కనిపిస్తుంటే... చరణ్ మాత్రం మీసాలు పెంచి కనిపించాడు కానీ.... పూర్తి అల్లూరిగా మాత్రం అనిపించలేదు. అయితే RRR ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ లుక్ పై మీడియాలో చాలానే డిస్కర్షన్స్ జరిగాయి.
చాలా రోజులుగా రామ్ చరణ్ నార్మల్ గా కనిపించినప్పటికీ... మీసకట్టులో మాత్రం కాస్త వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అందుకే చరణ్ బయట కనిపించడం మానేసాడు. అయితే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఎలా ఉంటాడో అనేది ఇప్పుడు రివీల్ అయింది. అది కూడా మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి రామ్ చరణ్ ఒక రెస్టారెంట్ లో ఒక ఫోటోకి ఫోజిచ్చాడు. ఆ ఫోటోలో అన్నదమ్ములిద్దరూ ఎలాంటి ఫుడ్ కుమ్మేస్తున్నారో అని చూడకుండా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ భలే కనిపిస్తున్నాడని అంటున్నారు. మీసకట్టు ఒంపుతో అచ్చం అల్లూరిగా కనిపిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ మాత్రం వాల్మీకి సినిమా కోసమే కాస్త గెడ్డంతో డిఫ్రెంట్ గా కనిపిస్తున్నాడు.
రామ్ చరణ్ అల్లూరి లుక్ తోనూ, వరుణ్ తేజ్ గెడ్డం లుక్ తోనే ఒకే ఫ్రేమ్ లో కనబడేసరికి.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయ్. నిజంగానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ బావుంది. మరి RRR లో రామ్ చరణ్ అల్లూరి లుక్ అలా బయటికొచ్చేస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.