ఒకేపని పదే పదే చేయడానికి ఎవరికైనా విసుగు వస్తుంది. ప్రభాస్ కు ఇటువంటిదే ఎదురైంది. యాక్షన్ సీన్స్ అంటే చాలు వద్దు బాబోయ్ అనేలా ఉన్నాడట. బాహుబలి సిరీస్ మొత్తం ఫుల్ యాక్షన్ పార్ట్ సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘సాహో’ పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్.. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ ఉన్నాయి. ఇందులో యాక్షన్ సీన్స్ హైలెట్ అవ్వనున్నాయి.
‘సాహో’ సినిమా తరువాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ పీరియడ్ లవ్ స్టొరీలో నటిస్తున్నాడు. ఇందులో కూడా యాక్షన్ పార్ట్ ఉందట. కానీ భారీ యాక్షన్ సీన్స్ లో నటించే ఉద్దేశం ప్రభాస్‌కు లేకపోవడంతో యాక్షన్ పార్ట్ ను తగ్గించమని డైరెక్టర్ కి చెప్పాడట. అందుకు డైరెక్టర్ కూడా స్టోరీలో కొన్ని మార్పులు చేసి యాక్షన్ పార్ట్ లైట్ గా పెట్టాడట.
ఇది ఒక లవ్ స్టోరీ కాబట్టి అందుకే యాక్షన్ పార్ట్ ను తగ్గించినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి యాక్షన్ సీక్వెన్సులను తొలగించి లైట్ గా పెట్టారట. ‘సాహో’ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ అవ్వనుంది. ‘సాహో’ ఆగస్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.