Advertisementt

ఈసారి ప్రచారానికి మహేష్ కూడా రెడీ!

Sat 23rd Mar 2019 10:59 AM
mahesh babu,maharshi movie,promotions,ready  ఈసారి ప్రచారానికి మహేష్ కూడా రెడీ!
Mahesh Babu Ready to Publicity ఈసారి ప్రచారానికి మహేష్ కూడా రెడీ!
Advertisement
Ads by CJ

రాజకీయాలకు దూరంగా వుండే మహేష్ ప్రచారానికి వెళ్లడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా... మహేష్ రాజకీయాల కోసం ప్రచారానికి వెళ్లడం లేదు కానీ.. తన సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ ప్రచారానికి రెడీ అవుతున్నాడు. మహేష్ బాబుకి బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు భారీ షాకిచ్చాయి. ఇక కొరటాల శివతో చేసిన భరత్ అనే నేను కూడా బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు కానీ.. అంత లేదు. అందుకే మహేష్ ఈసారి తన ల్యాండ్ మార్క్ సినిమా అయిన మహర్షి విషయంలో ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. మహర్షి సినిమా మరికొద్దిరోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం రెడీ అవుతుంది. దానితో పాటుగానే మహర్షి ప్రమోషన్స్ కూడా మొదలెట్టేయాలని మహర్షి టీం భావిస్తుంది. 

ఇక మహర్షి ప్రమోషన్స్ ని పీక్స్ లోకి తీసుకెళ్లాలని మహర్షి టీంతోపాటుగా మహేష్ కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నాడట. మే 9 న విడుదల కాబోతున్న మహర్షి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ పీక్స్ లో ఉండాలని.. అందుకే మహర్షి ప్రమోషన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాల్లో మహేష్ ప్రచారం చెయ్యాలనుకుంటున్నాడట. తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పట్టణాల్లో మహేష్ సుడిగాలి పర్యటన చేస్తాడట. ఈ మేరకు ఏప్రిల్ లో రూట్ మ్యాప్ ఖరారు కాబోతోందని తెలుస్తుంది. మరి చాలామంది హీరోలు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ ని ఇలా కాలేజ్ లలో, షాప్పింగ్ మాల్స్ లో చేస్తూనే ఉంటారు. 

కానీ మహేష్ మాత్రం సినిమాల ప్రమోషన్స్ లో చాలా వీక్ గా ఉంటాడు. ఈసారి నుండి అలా ఉండకుండా ప్రమోషన్స్ తోనే సినిమాని హిట్ తీరానికి చేర్చాలని చూస్తున్నాడు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే, మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు.

Mahesh Babu Ready to Publicity:

Mahesh Babu Green signal to Maharshi Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ