గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరముగా ఉంటున్న మంచు మోహన్ బాబు రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో.. చంద్రబాబుతో ఉన్న పరిచయంతో మంచు ఫ్యామిలీ టిడిపిలోకి వెళ్తుందని అనుకున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం టిడిపిని దూరం పెడుతూ... వైసిపికి దగ్గరవుతూ.. జగన్ తో సన్నిహిత సంబంధాలు మెయింటింగ్ చేస్తున్నాడు. కాకపోతే వైసిపిలోకి కూడా వెళ్లకుండా మంచు ఫ్యామిలీ మొత్తం జగన్ తో మాత్రం అనుబంధాన్ని కంటిన్యూ చేస్తుంది. అందులోనూ జగన్ చిన్నాన్న కూతురిని మంచు విష్ణు పెళ్లాడాడు కూడా... అందుకే జగన్ కి బాగా దగ్గరైంది మంచు ఫ్యామిలీ.
అయితే టిడిపి మీద రాళ్ళేస్తూ. చంద్రబాబుని కించపరుస్తూ మోహన్ బాబు ఈమధ్యన ఏపీ గవర్నమెంట్ పై కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల రీ ఇంబర్సుమెంట్ విషయంలో ఆంధ్ర ఫ్రభుత్వం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని.. విద్యా సంస్థలకు ఏపీ గవర్నమెంట్ వలన ఎలాంటి ఉపయోగం లేదని... విమర్శిస్తున్న మోహన్ బాబు తాజాగా... తిరుపతిలో కొన్ని విద్యా సంస్థలతో కలిసి ధర్నాలు చెయ్యడానికి రెడీ అయ్యాడు. మరి ఐదేళ్లుగా ఏం పట్టని మోహన్ బాబు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి.. ఏపీ గవర్నమెంట్ అలా... చంద్రబాబు ఇలా అంటూ రోడ్డెక్కడం చూస్తుంటే..... ఆయన వైసిపి కండువా కప్పుకోకపోయినా.. వైసీపీకి ప్రచారం చేస్తున్నాడనిపిస్తుంది.
అయితే మోహన్ బాబు ఇలా టిడిపిని విమర్శిస్తూ.. వైసిపికి సపోర్ట్ చేస్తే మాత్రం అయన కొడుక్కి వైపీసీ టిక్కెట్ ఏమన్నా ఇస్తారా ఏమిటి. ఇప్పటికే మంచు మనోజ్ కి జగన్ తిరుపతి ఎమ్యెల్యే టికెట్ ఇస్తాడనుకుని.. సినిమాలు పక్కనపడేసి.. తిరుపతిలో తిష్ట వేసిన మనోజ్ కి వైసిపి మొండి చెయ్యి చూపించింది. మరి ఇలా మోహన్ బాబు టిడిపిని విమర్శిస్తూ పోతే.. కొడుక్కి జగన్ ఏమన్నా సీటు ఇస్తాడనుకుంటున్నాడేమో. జగన్, మనోజ్ గురించి ఎంక్వైరీ చేయించే.. అతనికి టికెట్ ఇస్తే వైసిపి ఓడిపోతుందని మనోజ్ కి టికెట్ ఇవ్వలేదనే ప్రచారం కూడా జరిగింది.