రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు అడ్డంకులు అన్ని తొలిగిపోయాయి. ఇక వచ్చే శుక్రవారం అంటే.. మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. మరి నిన్నటివరకు విడుదల కష్టమంటూ వార్తలొచ్చినా... ఇప్పుడు విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయి.. సినిమా విడుదలకు రంగం సిద్దమవుతుంది. ఈ సినిమాని ఎలాగైనా ప్రేక్షకులముందుకు తెచ్చి.. ఈ ఎలక్షన్స్‌లో టిడిపి వారికి ఏదో విధంగా నష్టం కలిగించాలని వర్మ కట్టుకున్న కంకణానికి టిడిపి నాయకులే కాదు.. నందమూరి ఫ్యామిలీ కూడా స్పందించడం లేదు. ట్రైలర్స్, వీడియో సాంగ్స్‌తో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. తన వలన టిడిపి నాయకులూ, బాలయ్య ఫ్యామిలీ భయపడతారనుకున్నాడు. అలాగే వారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదల కాకుండా అడ్డుకుంటే.. తన సినిమాకి భారీ ప్రమోషన్స్ దక్కుతాయని ఆశపడ్డాడు. కానీ వారు మాత్రం స్పందించడం లేదు. వర్మ ఆశల మీది వాళ్ళు నీళ్లు చల్లేశారు.
చంద్రబాబుని ట్రైలర్ లో సాంగ్స్‌లో అలా విలన్ గా చూపిస్తున్నా.. టిడిపి నాయకులు కానీ, బాలకృష్ణ గానీ స్పందించకపోవడానికి కారణం మాత్రం అంతు చిక్కడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బావ చంద్రబాబు ఆదేశాల మేరకే బాలయ్య కామ్ అయ్యాడని, అలాగే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ గారికి అంకితమిస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలతో బాలయ్య మెత్తబడ్డాడనే కామెంట్స్ వినబడుతున్నాయి.
మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నందమూరి ఫ్యామిలీ, చంద్రబాబుని టార్గెట్ చేసి తీసింది. లక్ష్మి పార్వతిని అడుగడుగునా హైలెట్ చేస్తూ తీసిన ఈ సినిమాకి వైసిపి, అలాగే ఒక వర్గం ప్రేక్షకులు సపోర్ట్ చేసినా.. ఎన్టీఆర్ అభిమానులు, బాలయ్య అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఈ సినిమాని సపోర్ట్ చేసే అవకాశమే లేదు. మరి ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఎన్ని కోట్లు గడిస్తాడో చూద్దాం.