Advertisementt

‘బ్రోచేవారెవ‌రురా’ ఫ‌స్ట్ లుక్ వదిలారు

Thu 21st Mar 2019 05:08 PM
brochevarevarura,sri vishnu,nivetha thomas,vivek athreya,first look  ‘బ్రోచేవారెవ‌రురా’ ఫ‌స్ట్ లుక్ వదిలారు
‘Brochevarevarura’ first look Released ‘బ్రోచేవారెవ‌రురా’ ఫ‌స్ట్ లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

శ్రీవిష్ణు ‘బ్రోచేవారెవ‌రురా’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లేటెస్ట్ సెన్సేష‌న్స్ ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తున్నారు. ఈ త్ర‌యం రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూట‌ర్ రైడ్ చేసేలా ఈ పోస్ట‌ర్ ఉంది. 

వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ‘చ‌ల‌న‌మే చిత్ర‌ము.. చిత్ర‌మే చ‌ల‌న‌ము..’ అనేది ట్యాగ్ లైన్‌. 

శ్రీవిష్ణు స‌ర‌స‌న‌ నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యువ సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ సంగీత సార‌థ్యం అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

న‌టీన‌టులు:

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌

నిర్మాత‌: విజ‌య్ కుమార్ మ‌న్యం

బ్యాన‌ర్‌: మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌

సంగీతం: వివేక్ సాగ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరాం

ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌

పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌

‘Brochevarevarura’ first look Released:

Sri Vishnu and Nivetha Thomas Starring  ‘Brochevarevarura’ first look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ