Advertisementt

విజయ్ దేవరకొండ ప్లాన్ వర్కౌట్ అయ్యింది!

Wed 20th Mar 2019 02:56 PM
vijay deverakonda,suggestion,dear comrade,teaser,box office,success  విజయ్ దేవరకొండ ప్లాన్ వర్కౌట్ అయ్యింది!
Vijay deverakonda Plan Success at Box Office విజయ్ దేవరకొండ ప్లాన్ వర్కౌట్ అయ్యింది!
Advertisement
Ads by CJ

గత ఏడాది గీత గోవిందం హిట్ తర్వాత నోటా ప్లాప్ తగిలింది విజయ దేవరకొండకి. అలాగే టాక్సీవాలా హిట్ అయినా.. ఆ సినిమా బాగా తక్కువ బడ్జెట్ తో స్మాల్ ప్రమోషన్స్ తో అలాగే.. సినిమా లీకవడం వంటి విషయాలతో హిట్ అయినా విజయ్ దేవరకొండకి ఉపయోగం లేకుండా పోయింది. అయితే నోటా సినిమా ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ తన మైండ్ సెట్ ని మార్చుకున్నాడు. అందుకే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో యూత్ కి ఫ్యామిలీస్ కి బాగా దగ్గరైన విజయ్ యూత్ పల్స్ పట్టుకున్నాడు. ఇక నోటా ప్లాప్ కి ముందే డియర్ కామ్రేడ్ సినిమాని పట్టాలెక్కించిన విజయ్ దేవరకొండ... నోటా ప్లాప్ తో కథలో మార్పులు చేర్పులు చేయించాడట.

ఎలాగూ కొత్త దర్శకుడు భరత్ కమ్మ కూడా స్టార్ హీరోలాంటి విజయ్ చెబితే కాదనడు. ఇక విజయ్ క్రేజ్ తో మైత్రి వారు కూడా విజయ్ ఎలా చెబితే అలానే బడ్జెట్ పెట్టారట. ఈ విషయంలో ఎప్పుడో ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాకి రిపేర్లు చేపిస్తున్నాడని అన్నారు కూడా. తాజాగా డియర్ కామ్రేడ్ టీజర్ విషయంలో కూడా విజయ్ పంతమే నెగ్గిందనే టాక్ వినబడుతుంది. యూత్ కి సినిమా బాగా కనెక్ట్ అవ్వాలంటే... యూత్ కి నచ్చే విషయాలే టీజర్ లో ఉండాలని విజయ్ చెప్పడంతోనే... డియర్ కామ్రేడ్ ముందుగా కట్ చేసిన టీజర్ ని కూడా పక్కనెట్టి విజయ్ చెప్పినట్టు. యాక్షన్ కం రొమాన్స్ ని మిక్స్ చేసి... కథ క్లారిటీ ఇవ్వకుండా వదిలినట్లుగా తెలుస్తుంది. 

మరి విజయ్ దేవరకొండ గెస్ చేసింది కరెక్ట్. యూత్ కి ఒక విషయం ఎక్కింది అంటే... అది ఏ రేంజ్ క్రేజ్ సంపాదిస్తుందో అర్జున్ రెడ్డి సినిమా నిదర్శనం. అందుకే విజయ్ దేవరకొండ యూత్ పల్స్ పట్టుకుని.. యూత్ కి తొందరగా కనెక్ట్ అయ్యేలా తన సినిమాలు ఉండాలనుకుంటున్నాడని ఈ డియర్ కామ్రేడ్ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక తాజాగా డియర్ కామ్రేడ్ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ తో డియర్ కామ్రేడ్ టీం కూడా ఫుల్ హ్యాపీ. అంటే విజయ్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందనేగా..!

Vijay deverakonda Plan Success at Box Office:

Vijay deverakonda suggestion to Dear Comrade Teaser 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ