Advertisementt

అసిస్టెంట్లకు 50 లక్షలు ఇచ్చిన RRR బ్యూటీ!!

Wed 20th Mar 2019 12:28 PM
alia bhatt,surprises,driver and helper  అసిస్టెంట్లకు 50 లక్షలు ఇచ్చిన RRR బ్యూటీ!!
RRR Beauty Showcases Golden Heart అసిస్టెంట్లకు 50 లక్షలు ఇచ్చిన RRR బ్యూటీ!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ తన మంచి మనసును చాటుకున్నారు. తన వద్ద ఎంతోకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్‌కు, హెల్పర్‌కు చెరో రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ నగదుతో వారు ముంబయి శివారులో రెండు చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నారట. ఇటీవల ఆలియా తన 26వ పుట్టినరోజు జరుపుకొన్నారు. బర్త్‌డేకి రెండు రోజులు ఉందనగా ఆలియా వారికి సాయం చేసి సర్‌ప్రైజ్‌ చేశారట. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ఆలియా. అప్పటినుంచి సునీల్‌, అన్మోల్‌ అనే ఇద్దరు యువకులు ఆలియా వద్ద డ్రైవర్‌గా, హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఆలియా వారిని ఇంట్లో మనుషుల్లాగే చూసుకుంటారు. 

అందుకే వారికంటూ సొంత ఇళ్లు ఉండాలని భావించిన ఆలియా రూ.50 లక్షల చెక్కును అందజేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. వీరికనే కాదు.. తన మేకప్‌ ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌, కుక్‌.. ఇలా తన వద్ద పనిచేసే వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆలియా అండగా నిలుస్తుంటారు. వర్క్‌ పరంగా ఆలియా ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆమె ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఆలియా నటించబోయే తొలి తెలుగు చిత్రమిదే. ఇంకా అలియా ‘కళంక్’, ‘సడక్‌ 2 ’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.

RRR Beauty Showcases Golden Heart:

Alia Bhatt surprises her driver and helper

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ