రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా భారీ బడ్జెట్ తో భారీ లెవల్లో పది భాషల్లో నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో... బాలీవుడ్ నటులు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుండగా... ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ నటిస్తుంది. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా దేశభక్తి ప్రధాన నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న RRR బృందం తదుపరి షెడ్యూల్ కోసం నార్త్ ఇండియాకు బయలుదేరనుంది.
ఇక ఈ మూడో షెడ్యూల్ లో సినిమాలో కీలకపాత్రలో నటించనున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా పాల్గొంటాడని సమాచారం. ఈ సినిమాలో అజయ్ దేవగన్ విలన్ రోల్ కి రాజమౌళి తీసుకున్నాడని అనుకున్నారు. కానీ రాజమౌళి RRR ప్రెస్ మీట్ లో అజయ్ దేవగన్ విలన్ కాదని... స్పష్టం చేసాడు. ఇక అజయ్ దేవగన్ రోల్ సినిమా సెకండ్ హాఫ్ లో కేవలం ముప్పై నిమిషాల పాటు కనిపిస్తుందని అంటున్నారు.
అయితే అజయ్ దేవగన్ RRR లో కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో కనిపిస్తాడని... అజయ్ దేవగన్ ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర వల్లే.... యుక్తవయసులో వెళ్లిపోయిన ఎన్టీఆర్, చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని... కొన్ని సన్నివేశాలలో కనబడబోయే అజయ్ దేవగన్ పాత్రే... అలా ఎన్టీఆర్, చరణ్ పాత్రలకు ప్రేరణగా నిలిచే పాత్రగా ఉంటుందని అంటున్నారు.