కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా అప్పటిలో ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో కొన్ని డైలాగ్స్ రోమాలూ నిక్కపొడుచుకునేలా ఉంటాయి. ముఖ్యంగా సీతారామరాజు బ్రిటీష్ వారి బుల్లెట్ల వర్షంలో తడుస్తూ… భారీ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ కి ప్రతి భారతీయుడి రోమాలూ నిక్కబొడుస్తాయి.
సేమ్ అలానే అలాంటి సన్నివేశమే ‘సైరా’లో కూడా చూడబోతున్నాం. నరసింహ రెడ్డి అప్పటిలో బ్రిటీష్ వారిపై పోరాడిన తొలి తరం యోధుడు. కొన్నేళ్ల పాటు బ్రిటీష్ వారిని గడగడలాడించాడు. చివరికి బ్రిటిష్ వారు సైరా కు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష సమయంలో బ్రిటీష్ వారిని ఉద్దేశించి సైరాతో కొన్ని డైలాగులు చెప్పించారు.
ఆ డైలాగ్స్ థియేటర్స్ ఫ్యాన్స్ విజిల్స్ తో మోత మోగించేయడం ఖాయమని చెబుతున్నారు. దాదాపు 2 పేజీల నిడివి ఉన్న డైలాగ్‌ని చిరంజీవి అనర్గళంగా పలికాడట. సాయి మాధవ్ బుర్ర రాసిన ఈ డైలాగ్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి అంట. ఆల్రెడీ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి అయింది. ఆ సీన్ సినిమాలో బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్.