Advertisementt

వర్మ ఆఖరి అస్త్రం వదులుతున్నాడట!

Tue 19th Mar 2019 12:15 PM
ram gopal varma,lakshmis ntr,release,postpone  వర్మ ఆఖరి అస్త్రం వదులుతున్నాడట!
Lakshmi’s NTR Release To Postpone వర్మ ఆఖరి అస్త్రం వదులుతున్నాడట!
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని థియేటర్స్ లోకి తేవడానికి నానా తంటాలు పడుతున్నాడు. నిన్నటివరకు అసలు సినిమా విడులవుతుందో లేదో అనుకున్న వర్మకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి ఊపిరి పీల్చుకున్న వర్మకి ఇప్పుడు సెన్సార్ బోర్డు బ్రేక్ వేస్తుంది. ఈ ఎన్నికల ముందు సినిమాని విడుదల చేసి ఏపీ సీఎంనే ప్రజలముందు దోషిగా నిలబెట్టాలి అనుకున్న వర్మ ఆటలు సెన్సార్ వారు సాగనివ్వడం లేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రోమోస్ తోనూ, ట్రైలర్ తోనూ పిచ్చ హైప్ క్రియేట్ చేసిన వర్మ అక్కడితో  ఆగడం లేదు... లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని కీలక సన్నివేశాలను ఇంటర్నెట్ లో లీక్ చేస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు. ఇక రేపు శుక్రవారం విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ కారణాలతో వాయిదా పడింది.

సెన్సార్ వారు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తే.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా ఆ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాల వలన ఏదో రాజకీయ దురుద్దేశ్యంతో కాంట్రవర్సీలను చెయ్యడానికి ... ఈ సినిమా తీసినట్టుగా.. అలాగే ఎన్నికల టైం లోనే విడుదల చెయ్యాలని అనుకోవడంతోనే.. సెన్సార్ బోర్డు వారు ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పోలింగ్ పూర్తయ్యేవరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్‌ ను వాయిదా వేస్తున్నామని తెలియజేసింది. కానీ వర్మ మాత్రం సెన్సార్ బోర్డు కావాలనే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తన సినిమాకి ఇబ్బందులు కలగజేస్తుందని.. అందుకే సెన్సార్ బోర్డు పై తానూ కేసు పెడుతున్నట్లుగా చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. 

అసలు ఒక సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వడాన్ని ఇష్టమొచ్చినట్లు వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకు లేదని.. చట్ట విరుద్ధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నిస్తోందని.. వర్మ ఆరోపిస్తున్నాడు. అందుకే తానూ సెన్సార్ బోర్డుపై కేసు పెడుతున్నట్లుగా చెబుతున్న వర్మ అస్త్రానికి సెన్సార్ బోర్డు తలొగ్గుతుందా...! ఒకవేళ సినిమా గనక విడుదల ఆపితే.. ప్రస్తుతం వేడి మీదున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ హైప్ కాస్త తగ్గడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 

Lakshmi’s NTR Release To Postpone:

Lakshmi’s NTR, What Will RGV Decide?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ