Advertisementt

‘డియర్ కామ్రేడ్’ టీజర్: ‘అర్జున్ రెడ్డి 2’నా?

Tue 19th Mar 2019 11:28 AM
vijay deverakonda,dear comrade,teaser,release  ‘డియర్ కామ్రేడ్’ టీజర్: ‘అర్జున్ రెడ్డి 2’నా?
Dear Comrade Teaser Talk Review ‘డియర్ కామ్రేడ్’ టీజర్: ‘అర్జున్ రెడ్డి 2’నా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్, రేంజ్ ఏ లెవల్లో ఉన్నాయో అందరికి తెలుసు. విజయ్ దేవరకొండ సినిమాలపై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అంతలా విజయ్ దేవరకొండ ప్రేక్షకులను, మార్కెట్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంటే.. చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలెట్టేసింది. రష్మిక మందన్న - విజయ దేవరకొండ మరోసారి వెండితెర మీద కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుంటే... కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం వదిలిన డియర్ కామ్రేడ్ టీజర్ లో రెండు రకాల ఎమోషన్స్ కనబడుతున్నాయి. కడలల్లె వేచె కనులే... అనే పాట బ్యాగ్రౌండ్ లో వస్తుంటే.. స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ విద్యార్థుల గొడవల్లో అప్పోజిషన్ విద్యార్థులను చితక్కొట్టేస్తున్న సీన్ తో పాటుగా... వర్షంలో హీరోయిన్ రష్మిక మందన్నతో లిప్ లాక్ కిస్ పెడుతున్న సీన్ చూస్తుంటే... విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది. 

అర్జున్ రెడ్డి సినిమాలో మెడికోగా, ఫుడ్ బాల్ ప్లేయర్ గా కాలేజీలోను గొడవలు, హీరోయిన్ షాలిని పాండేతో లిప్ లాక్ కిస్సులతోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి డియర్ కామ్రేడ్ కూడా అర్జున్ రెడ్డి పోలికలతోనే కనబడుతుంది. అర్జున్ రెడ్డి మాదిరిగానే స్టూడెంట్స్ గొడవలు, హీరోయిన్ లిప్ లాక్ కిస్సు.. మరి ఇదంతా చూస్తుంటే.. రెండు రకాల ఎమోషన్ తో అర్జున్ రెడ్డి 2 ని దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను తెరకెక్కించాడు అనిపిస్తుంది.

Click Here For Dear Comrade Teaser

Dear Comrade Teaser Talk Review:

Dear Comrade Teaser Review: 2 Emotions  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ