సూపర్‌స్టార్ మహేష్‌బాబు చూసేందుకు మిల్కీబోయ్‌లా అమాయకంగా కనిపిస్తాడు. కానీ ఆయనలో మరో అపరిచితుడు ఉన్నాడు. తన వద్ద మొహమాటం, సిగ్గు ఉందని పలువురు భావిస్తారు. కానీ ఆయన సెట్స్‌లో ఉంటే సందడే సందడి అని, స్పాంటేనియస్‌గా సెటైర్లు వేసి నవ్విస్తూ ఉంటాడని ఆయనతో షూటింగ్‌లలో గడిపిన వారు చెబుతూ ఉంటారు. ఇక తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ నుంచి గుణపాఠం నేర్చుకున్నాడేమో గానీ తనకి ఇష్టం లేని పనిని సున్నితంగా నో చెప్పేస్తాడు. ఇది తాజాగా సుకుమార్ చిత్రం విషయంలో నిరూపితం అయింది. అలాగే తన తండ్రిలా రెమ్యూనరేషన్‌లో ఉదారంగా ఉండడు. ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటాడు. ఇక ఆయన కృష్ణ నుంచి సామాజిక బాధ్యతలను కూడా వారసత్వంగా పొందాడు బాగా సంపాదించి, మరింత భారీగా దానం చేయమనేది ఆయన సిద్దాంతం. అందుకే ఆయన సినిమాలు, మల్టీనేషనల్ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా, వ్యాపార రంగంలోకి కూడా ప్రవేశించాడు.
ఇక విషయానికి వస్తే ఈయన చేసే గుప్తదానాలు ఎన్నో ఉంటాయని, కానీ వాటిని ఆయన బయటపెట్టడని అంటూ ఉంటారు. ఎవరో మూడో వ్యక్తి ద్వారా అవి తెలియాల్సిందే గానీ ఆయనంటూ సొంతగా వాటిని బయటపెట్టడు. తెలంగాణలో, ఏపీలలో రెండు గ్రామాలను ఆయన దత్తత తీసుకున్నాడు. ‘మా’ అసోసియేషన్ బిల్డింగ్ నిధుల కోసం ఏమైనా చేస్తానని మాట ఇచ్చాడు. రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రికి ఉచితంగా ప్రచారం చేస్తున్నాడు. ఇంకా ఈయన చేసే మంచి కార్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. తన మ్యారేజ్ డే సందర్భంగా దాదాపు 600లకు పైగా అంధులైన పిల్లలతో విందు ఏర్పాటు చేశాడు.
ఇక విషయానికి వస్తే శ్రీకాకుళంకి చెందిన 12 ఏళ్ల చిన్నారి పర్వీన్‌బేబి క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతోంది. పర్వీన్‌కి మహేష్‌బాబు అంటే ప్రాణం. ఆ పాపకి ఆయనే ఫేవరేట్ స్టార్. తన అభిమాన హీరోని ఒక్కసారైన కలవాలనేది ఆమె కోరిక. ఈ సంగతి తెలుసుకున్న మహేష్ ఇటీవల వెళ్లి ఆ పాపని కలిశాడు. ఆమెకి జరుగుతున్న వైద్యం, సదుపాయాల గురించి తెలుసుకుని ఆ పాప క్యాన్సర్ నుంచి బయటపడాలని కోరుకున్నాడు. పాపతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కూడా కలిసి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాప త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అంతే కాకుండా మహేష్‌బాబు రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్‌లైఫ్‌లో కూడా సూపర్‌స్టారేనని కితాబునిస్తున్నారు.