Advertisementt

అందమైన ప్రదేశాల్లో... అసలేం జరిగింది

Mon 18th Mar 2019 10:38 PM
sri ram,asalem jarigindi,movie shooting,updates  అందమైన ప్రదేశాల్లో... అసలేం జరిగింది
Asalem Jarigindi Movie Latest Update అందమైన ప్రదేశాల్లో... అసలేం జరిగింది
Advertisement
Ads by CJ

శ్రీరాం, సంచితా పడుకునే హీరోహీరోయిన్లుగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న అసలేం జరిగింది. కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. ఈ  సినిమా సెకండ్ షెడ్యూల్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు అందమైన లొకేషన్లలో ఇటీవల ప్రారంభమైంది.

 రెండు పాటలు, క్లెమాక్స్ సీన్స్, పోరాటాలు, సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తామని నిర్మాత కె.నీలిమా తెలిపారు. మార్చి 31 లోపు టాకీ భాగం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఎడిటింగ్, గ్రాఫిక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా జరుపుతున్నామని చెప్పారు. లవ్, సస్పెన్స్ జానర్ కింద నిర్మితమయ్యే ఈ సినిమా తమకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని హీరోహీరోయిన్లు శ్రీరాం, సంచితాలు తెలిపారు. 

కో-ప్రొడ్యూసర్ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలు, ఫైట్లు, యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయన్నారు. ప్రధానంగా యూత్‌ని ఆకర్షించే విధంగా సినిమా పాటలుంటాయన్నారు. వీటిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ఫైట్ మాస్టర్ శంకర్ యాక్షన్ సీన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపారు.

Asalem Jarigindi Movie Latest Update:

Asalem Jarigindi Movie Shooting In Beautiful places

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ