సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినీ కెరీర్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు, తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తాడు. ఓ సినిమా షూటింగ్‌లోనే కొంత గ్యాప్ వస్తే ఏదో ఒక యాడ్‌లో నటించేసి వస్తుంటాడు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో ఎంతో కీలకమైన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిల నిర్మాణ భాగస్వామ్యంలో ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పాటలు మినహా పూర్తయిందట. గుమ్మడికాయ కొట్టేశారని చెబుతున్నారు. ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ కోసం అన్నపూర్ణ ఎడెకరాల స్టూడియోలో భారీ సెట్స్‌ని నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో తనకి కాస్త గ్యాప్ రావడంతో ఆయన సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించే ఓ యాడ్ ప్రకటన కోసం అక్కడ వాలిపోయాడు. ఇలా రిలాక్స్ మూడ్‌లో ఉన్న ‘మహర్షి’ రిలాక్స్ మూడ్‌లోకి వచ్చి వెహికల్ నడుపుతుండగా, మహేష్ వెనుక నుంచి దీనిని ఫొటో తీసి నమ్రతా సోషల్‌మీడియాలో పెట్టింది.
ఇక ‘మహర్షి’ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తామని తెలిపారు. ముందుగా యూనిట్ భావించినట్లు ఏప్రిల్ 5నే అయితే ఎన్నికల హడావుడితో సినిమాని ఎలాగైనా పోస్ట్‌పోన్ చేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా ఏప్రిల్ 25న కూడా కాకుండా ఏకంగా మే9 వ తేదీని ఫిక్స్ చేసుకోవడం మహేష్‌కి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇక ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్న సందర్భంగా అప్పటివరకు ప్రజలంతా ఎన్నికల మూడ్‌లో ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టినా ప్రేక్షకుల మూడ్‌ని మరలించలేదు. దాంతో నిదానంగా సినిమా పూర్తి చేసుకుని ఏప్రిల్ 11 తర్వాత అంటే ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రమోషన్స్ మొదలుపెట్టాలనే ఆలోచనలో యూనిట్ ఉంది.
ఇక దీని తర్వాత మహేష్, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, అనిల్‌సుంకరల భాగస్వామ్యంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇక ఈయన రాజమౌళితో కూడా కలిసి చేయాల్సివుంది. కానీ ఇటీవల రాజమౌళిని ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రెస్‌మీట్ సందర్భంగా మహేష్ చిత్రం గురించి మాట్లాడాల్సివచ్చినప్పుడు ఆ ప్రశ్నను దాదాపు జక్కన్న దాటవేశాడు. అయితే రాజమౌళి మాత్రం దుర్గా ఆర్ట్స్ అధినేత కె.యల్.నారాయణకు ఓ చిత్రం చేయాల్సివుంది. కానీ జక్కన్న మాత్రం వచ్చే ఏడాది జులై30 వరకు ఆర్.ఆర్.ఆర్ బిజీలోనే ఉంటాడు. ఆ తర్వాత ఆయన చేయబోయే చిత్రంలో హీరో ఎవరనేది తేలాల్సివుంది. ఆర్.ఆర్.ఆర్ విడుదలైన తర్వాత స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టినా దాని కోసం జక్కన్న కనీసం ఏడాది గ్యాప్ తీసుకోవడం ఖాయం. అందునా ఆయన మగధీర వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా సునీల్‌తో మర్యాదరామన్న చేశాడు.
ఇక ఈగలో పెద్దగా హీరో లేకుండానే చిత్రంచేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్, రాజమౌళిల కాంబినేషన్ కలవాలంటే చాలా కాలమే పట్టేట్లు ఉంది. రాజమౌళి మాత్రం ఇప్పటివరకు ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకే పరిమితం అవుతున్నారు. మరి రాజమౌళి చిత్రం ఎప్పుడు ఉంటుంది? అసలు ఉంటుందా లేదా అనేవి వేచిచూడాల్సివుంది..!