ఇప్పటికే రష్మిక... టాప్ రేంజ్ లో ఉన్న రకుల్ కి తెలుగు, తమిళంలో కూడా స్పాట్ పెట్టేసింది. కానీ తాజాగా రష్మిక మందన్న బిజీతో ఒక అవకాశం రకుల్ తలుపు తట్టినట్లుగా తెలుస్తుంది. మరి రష్మిక ఖాళీ లేక రకుల్ ని సంప్రదించారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. ఇంతకీ రష్మిక వదిలేసి.. రకుల్ ని తగులుకున్న ఆ ఆఫర్ ఏమిటి అంటే... సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక చిత్రలహరి తర్వాత సాయి ధరమ్ తేజ్, మారుతీ దర్శకత్వంలో మరో మూవీ కమిట్ అయిన సంగతి తెలిసందే.
ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లాయర్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మారుతీ మార్క్ కామెడీ డైలాగ్స్ తో సాయి ధరమ్ లాయర్ గా ఈ సినిమాలో కామెడీ పండించబోతున్నాడని... చిరు అభిలాష టైప్ లో మారుతీ - సాయి ధరమ్ కాంబో మూవీ ఉండబోతున్నది అని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా కోసం సాయి ధరమ్ కాస్త ఒళ్ళు తగ్గిస్తున్నాడని... లాయర్ గా కనిపించాలంటే కాస్త సన్నగా ఉండాలని స్పెషల్ మేకోవర్ అవుతున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న రష్మిక మందన్న అయితే బావుంటుందని మారుతీ అనుకున్నాడట.. కానీ రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీ. కొన్ని సినిమాలను డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక వదులుకుందనే టాక్ ఉంది.
అందుకే విన్నర్ లో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన రకుల్ ప్రీత్ ని మారుతీ - సాయి ధరమ్ సినిమా కోసం ఎంపిక చెయ్యబోతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేని ఈ భామ కి సాయి ధరం సినిమాలో అవకాశం రావడం రష్మిక పుణ్యమే అంటున్నారు. రష్మిక ఖాళీ లేకపోవడంతో ఆ ఆఫర్ రకుల్ కి తగిలింది అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి చేతిలో బాలీవుడ్ సినిమాలు తప్ప సౌత్ సినిమాలకు దూరమవుతున్న తరుణంలో సాయి ధరమ్ సినిమా ఛాన్స్ రకుల్ కి ఊరటనిచ్చినట్లేగా..!