మన స్టార్స్ ఒకసారి నటించిన హీరోయిన్లతో పదే పదే నటించరు. సినిమా సినిమాకి కొత్తజోడీ కోసం ఎదురుచూస్తుంటారు. ఒకసారి నటించిన హీరోయిన్‌నే తీసుకుంటే ప్రేక్షకులు, అభిమానులు బోర్‌గా ఫీలవుతారని వారి అభిప్రాయం. ఇక విషయానికి వస్తే నేచురల్‌స్టార్ నాని ఎప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లతో నటించడు. వారి కోసం టైం, బడ్జెట్ ఎక్కువ కాకుండా ఉండేందుకు కొత్తవారితో నటించి వారినే స్టార్ హీరోయిన్లుగా మారుస్తూ ఉంటాడు.
ఇక విషయానికి వస్తే తాజాగా ఓ చిత్రంలో క్రితం నానితో నటించిన హీరోయిన్ మరో హీరోతో, ఆ మరో హీరోయిన్‌తో నటించిన హీరో సరసన నాని హీరోయిన్ నటించనుందని సమాచారం. ఇదేదో కన్‌ఫ్యూజన్‌గా ఉంది కదూ...! నాని ప్రస్తుతం ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత తన 24వ చిత్రంగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. వీటి తర్వాత నాని తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో టాప్‌హీరోల రేంజ్ బడ్జెట్‌తో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రం నిర్మాత, దర్శకులు కూడా భారీ చిత్రాలు తీసేవారేనట.
ఇక నాని విక్రమ్ కె కుమార్ చిత్రం తర్వాత దిల్‌రాజుతో కలిసి తాను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటూ తనకి హీరోగా మంచి బ్రేక్ వచ్చిన ‘అష్టాచెమ్మా, జెంటిల్‌మెన్’ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చేస్తాడని తెలుస్తోంది. ఇక మన హైదరాబాదీ అమ్మాయి అదితీరావు హైదరి, ‘జెంటిల్‌మెన్, నిన్నుకోరి’ చిత్రాల ఫేమ్ నివేదా థామస్‌లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అదితీరావు హైదరి మణిరత్నం ‘చెలియా’ ద్వారా పరిచయమైనా, ఇంద్రగంటి, సుధీర్‌బాబుల ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగువారిని ఆకట్టుకుంది. ఇక సుధీర్‌బాబు హీరోయిన్ ఇంద్రగంటి తాజా చిత్రంలో నాని సరసన నటిస్తుండగా, నాని ‘జెంటిల్‌మేన్, నిన్నుకోరి’ చిత్రాల ఫేమ్ నివేధాథామస్ సుధీర్‌బాబుతో జత కట్టనుండటం విశేషం. ఈ ఇద్దరు హీరోయిన్లకు తెలుగులో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణనే కావడం విశేషం.