గోడకు బంతిని ఎంత ఫోర్స్‌గా కొడితే రెట్టింపు వేగంతో తిరిగి వస్తుంది. వర్మ అలాంటి వాడే తనని తొక్కెయ్యాని చూస్తే రెట్టించిన వేగంతో మళ్లీ పైకొస్తుంటాడు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని విడుదల కానివ్వం అంటూ టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తుంటే వాటికి భిన్నంగా వర్మ ప్లాన్‌లు చేస్తుండటం విశేషం. ఎన్టీఆర్ జీవితంలోని కీలక గట్టం నేపథ్యంలో వివాదస్పద అంశాల్ని చర్చిస్తూ రామ్ గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. ఏపీ ఎన్నికల వేళ ఓటర్లని ప్రభావితం చేసేలా వున్న ఈ చిత్ర విడుదలని నిలిపి వేయాలంటూ టీడీపీకి చెందిన కొంత మంది నాయకులు ఎలక్షన్ కమీషన్‌ని సంప్రదించారు.
దీనిపై జాతీయ ఎలక్షన్ కమీషన్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదలపై ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయాన్నిప్రకటిస్తారు?. అసలు సినిమా విడుదలయ్యే ఛాన్స్ వుందా? ఎలక్షన్‌ల తరువాత విడుదల చేసుకోమంటే పరిస్థితేంటి? సఇనిమాని ఎవరైనా చూస్తారా? అనే యక్ష ప్రశ్నలకు రాష్ట్న ఎన్నికల ప్రధానాధికారి క్లిరిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ చిత్ర విడుదలను అడ్డుకోలేమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో సినిమా విడుదలపై ఏర్పడ్డ ఉత్కంఠకు తెరపడింది. `లక్ష్మీస్ ఎన్టీఆర్` అనుకున్న ప్రకారమే ఈ నెల 22న విడుదల కాబోతోంది.
ఇదిలా వుంటే వర్మ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశాడు. వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్ అనే పేరుతో కడపలో ఈ కార్యక్రమాన్ని ఓ భారీ బహిరంగ సభలా నిర్వహించబోతున్నామని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం సంచలనంగా మారింది. ఇటీవల వైస్రాయ్ హోటల్ కు సంబంధించిన కీలక ఘట్టాలను లీక్ చేసిన వర్మ ప్రీ రిలీజ్ ఈ వెంట్లో ఎలాంటి బాంబులు పేలుస్తాడో వేచి చూడాల్సిందే. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వర్మ వెనక్కి తగ్గకపోవడం టీడీపీ శ్రేణులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట.