Advertisementt

పందెంకోడి నిశ్చితార్థం ఈ రోజే!

Sat 16th Mar 2019 11:05 PM
vishal,anisha alla,anisha,vishal engagement,anisha alla engagement  పందెంకోడి నిశ్చితార్థం ఈ రోజే!
vishal and anisha alla engagement tody పందెంకోడి నిశ్చితార్థం ఈ రోజే!
Advertisement
Ads by CJ

గ‌త కొంత కాలంగా పెళ్లంటే దాటేస్తూ వ‌స్తున్న పందెంకోడి విశాల్ ఇటీవ‌ల హైద‌రాబాదీ అమ్మాయి, పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాల‌ ఫేమ్ అనీషాని వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌కు చెందిన పారిశ్ర‌మిక వేత్త కుటుంబానికి చెందిన అనీషాని ఓ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తొలి చూపులోనే ప్రేమించిన విశాల్ ఆ త‌రువాత ఆ ప్రేమ‌ని పెళ్లిదాకా తీసుకొచ్చాడు. గ‌త కొంత కాలంగా స‌హ‌న‌టి వ‌ర‌ల‌క్ష్మితో ప్రేమ‌లో వున్నాడ‌ని జ‌రిగిన ప్ర‌చారానికి బ్రేకిచ్చిన విశాల్ అనూహ్యంగా అనీషాను ప్రేమించ‌డం, పెళ్లిదాకా తీసుకురావ‌డం ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు. 

అయితే వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ ఈ రోజు( శ‌నివారం) హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఇరు కుటుంబాల వాళ్లు ఎలాంటి హంగామా చేయ‌డం లేదు. ఇరుకుటుంబాల‌కు సంబంధించిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశార‌ట‌. నిరాడంబ‌రంగా జ‌రుగుతున్న ఈ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లోనే పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేయ‌బోతున్నార‌ట‌. వివాహం కూడా హైద‌రాబాద్‌లోనే నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిసెప్ష‌న్ మాత్రం చెన్నైలో భారీ స్థాయిలో జ‌ర‌పాల‌ని ఏర్పాట్లే చేస్తున్నార‌ట‌. విశాల్ ప్ర‌స్తుతం `టెంప‌ర్‌` ఆధారంగా రూపొందుతున్న `అయోగ్య‌`లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

vishal and anisha alla engagement tody:

vishal and anisha alla engagement tody in hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ